Selfi Problem: సెల్ఫీ తెచ్చిన కష్టాలు.. బదిలీ అయిన పోలీసు అధికారి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Selfi Problem: ప్రస్తుతం ఎవరి చేతిలో చూసిన స్మార్ట్ ఫోన్ కనిపిస్తుంది. ఇక చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే ఊరుకుంటారా? దాంతో సెల్ఫీనో లేకపోతే రీల్స్ చేయడమో చేస్తుంటారు. అలా చేసిన వాటితో కొందరు పాపులర్ అవుతారు.. మరికొందరు వాటితో చిక్కుల్లో పడతారు. అయితే ఇక్కడ కుటుంబంలోని భార్యా, పిల్లలు తీసుకున్న సెల్ఫీతో ఒక పోలీస్ అధికారి చిక్కుల్లో పడ్డారు. వారు తీసుకున్న సెల్ఫీ మూలంగా తాను బదలీ కావల్సి వచ్చింది. పైగా సెల్ఫీపై విచారణ చేపట్టాల్సి వచ్చింది. ఒక సెల్ఫీ ఇంత పనిచేసిందా? అనుకుంటున్నారా? అవును మరీ.. ఆ సెల్ఫీ మామూలు సెల్ఫీ కాదు.. నోట్ల కట్టలతో వారు తీసుకున్న సెల్ఫీ .. అందుకే దానికి అంతా క్రేజీ.. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో జరిగింది. ఇవి వివరాలు..
Also Read
- Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
ప్రస్తుత జనరేషన్ సోషల్ మీడియాలో ప్రతి విషయాన్ని పంచుకోవడం కామన్ అయ్యింది. ఓ పోలీసు అధికారి భార్య, పిల్లలు సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఓ ఫోటోకు .. అతడ్ని బదిలీ చేసి .. ఆ అతనిపై విచారణకు ఆదేశించారు. రూ.500 నోట్ల కట్టలతో తన భార్య, పిల్లలు తీసుకున్న సెల్ఫీ సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో ఓ పోలీసు అధికారి బదలీ కావల్సి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లా బెహతా ముజావర్ పోలీస్ స్టేషన్‌లో రమేష్ చంద్ర సహాని సబ్-ఇన్‌స్పెక్టర్ పని చేస్తున్నారు.ఇటీవల ఆ అధికారి భార్య, అతని పిల్లలు నోట్ల కట్టలతో సెల్ఫీ తీసుకుని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆ సెల్ఫీ వైరల్ కావడంతో ఆ అధికారిపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. దీంతో ఆ అధికారిని వెంటనే మరో ప్రాంతానికి బదిలీ చేశారు. ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న ఫోటోలో రూ. 14 లక్షల విలువైన నగదును ఒక బెడ్‌పై పెట్టి.. ఆ నోట్ల కట్టల పక్కన పోలీసు అధికారి భార్య , ఇద్దరు పిల్లలు కూర్చోని ఫోజు ఇవ్వడం ఆ ఫోటోలో చూడవచ్చు.నోట్ల కట్టల ఫోటో వైరల్ కావడంతో, వెంటనే పోలీసు అధికారిపై దర్యాప్తుకు ఆదేశించారు. స్టేషన్ ఇన్‌చార్జి రమేష్ చంద్ర సహాని బదిలీ అయ్యారు. బదలీ అయిన రమేష్ చంద్ర సహాని తనను తాను సమర్థించుకుంటూ.. ఆ ఫోటో నవంబర్ 14, 2021న తాను కుటుంబ ఆస్తిని విక్రయించినప్పుడు వచ్చిన డబ్బుతో తీసుకున్నదని చెప్పాడు.
Read also: Bank Accounts Rules: ఓ వ్యక్తికి ఎన్ని బ్యాంకు అకౌంట్స్ ఉండొచ్చు.. ఆర్బీఐ నిబంధనలు ఎలా ఉన్నాయంటే?
ఈ సంఘటనకు సంబంధించిన వివరాలపై ఒక సీనియర్ పోలీస్ అధికారి మీడియాతో మాట్లాడాడు. బెహతా ముజావర్ స్టేషన్-హౌస్ ఆఫీసర్ కు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఫోటోలో ఆ పోలీసు అధికారి భార్య , అతని పిల్లలు ఉన్నారు. వారు నోట్ల కట్టలను చూపిస్తూ.. ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఈ విషయాన్ని గుర్తించాము. ప్రస్తుతం పోలీసు అధికారి బదిలీ చేయబడ్డాడని చెప్పిన ఉన్నతాధికారి.. అతనిపై దర్యాప్తు కొనసాగుతోంది అని తెలిపారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలను మీడియాకు తెలియజేస్తామని తెలిపారు. పోలీసు భార్య, పిల్లలు సెల్ఫీలో చూపించిన డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయనే అంశంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!