దేశానికి వెలుగును అందిస్తున్న రామగుండం పారిశ్రామిక ప్రాంతం నిరాదరణకు లోనవుతోందని మండిపడ్డారు రామగుండం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్. ఇతర ప్రాంతాల్లో విద్యుత్ పరిశ్రమలు నెలకొల్పేందుకు రామగుండం సింగరేణి దోహదపడింది. ఎన్ని ప్రభుత్వాలు మారిన రామగుండం లో బిపిఎల్ రాలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రామగుండం ను చీకటి మాయం చేయాలని చూస్తున్నారు.రామగుండం ప్రాంతంపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్లక్ష్యం వహిస్తున్నారు. రామగుండం లో జరుగుతున్న బుడిద మాఫియా పై విజిలెన్ విచారణ…
తెలంగాణలో సంచలనం కలిగించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసులో విచారణ వేగవంతంగా సాగుతోంది. ఏడుగురు నిందితులను నాలుగు రోజుల పాటు కస్టడీకి అనుమతించింది మేడ్చల్ కోర్టు. మరికొద్ది సేపట్లో నిందితులను కస్టడీకి తీసుకొని విచారణ చేయనున్నారు పేట్ బషీరాబాద్ పోలీసులు. హత్య కుట్ర ఏ విధంగా ప్లాన్ చేశారు అనేదానిపై లోతైన దర్యాప్తు జరపనున్నారు. ఎనిమిది మంది నిందితులతో పాటు మిగిలిన వ్యక్తుల ప్రమేయం పై విచారణ సాగనుంది. ఇప్పటికే మాజీ ఎంపీ జితేందర్…
వాళ్లంతా పోలీస్ ఇన్‌స్పెక్టర్లు. యూనిఫామ్ డ్యూటీలో ఉన్న అధికారులు. సొంతంగా విదేశాలకు వెళ్లితే ఎలాంటి గొడవా ఉండేది కాదు. కానీ.. లిక్కర్ డాన్‌తో మిలాఖతై ఫారిన్ ట్రిప్పులకు వెళ్లి.. థాయ్ మసాజ్‌లు.. క్యాసినో ఆటల్లో మునిగి తేలారట. విషయం తెలిసి పోలీస్ బాస్‌లు కన్నెర్ర చేయడంతో డిపార్ట్‌మెంట్‌లో అలజడి మొదలైంది. వాళ్లెవరో లెట్స్ వాచ్..! జల్సాల కోసం విదేశాలకు ఇన్‌స్పెక్టర్లు..?బ్యాంకాక్‌లో విహార యాత్రలు.. థాయ్ మసాజ్‌లు.. శ్రీలంకలో అమ్మాయిలతో జల్సాలు..క్యాసినో జూదాలు.. ఇవన్నీ పారిశ్రామికవేత్తలో లేక సంపన్నులో…
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సింగరేణి కేటీకే 5వ బొగ్గు గనిలో పెను ప్రమాదం తప్పింది. ఫస్ట్ షిఫ్ట్ లోని 11 డీపీ వద్ద భారీగా చేరింది నీరు. దీంతో నీటిలో మునిగాయి 150 హెచ్ పి మోటార్లు. హుటాహుటిన సంఘటనా స్థలం నుంచి పైకి వచ్చారు కార్మికులు. దీంతో విద్యుద్ఘాతం నుంచి తప్పించుకున్నారు. పెను ప్రమాదం తప్పిందని కార్మికులు ఊపిరి పీల్చుకున్నారు. ఒక్కో మోటారు రూ.50 లక్షల విలువ చేస్తాయని, సింగరేణికి రూ.1కోటి రూపాయల నష్టం…
సీడీఎస్ బిపిన్ రావత్ ప్రమాదం పై హై లెవెల్ ఎంక్వైరీ కొనసాగుతోందన్నారు ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి. విచారణ కమిటీలో ఎయిర్ ఫోర్స్ కు చెందిన ఉన్నతాధికారులు ఉన్నారు. వాతావరణ తప్పిదమా.. మానవ తప్పిదమా.. లేక సాంకేతిక లోపమా అనేది విచారణ చేస్తున్నాం. ఎలాంటి ఆధారాలు లేకుండా ప్రమాదం పై ఇప్పుడే ఏమీ మాట్లాడలేమన్నారు. హైదరాబాద్ దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో జరిగిన పాసింగ్ పరేడ్ కార్యక్రమంలో ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్…
దేశవ్యాప్తంగా విషాదం నింపిన హెలికాప్టర్ ప్రమాదానికి పొగమంచే కారణమని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మూడురోజుల నుంచి ఈ మార్గంలో ట్రయల్ రన్ నడుస్తోంది. సంజప్పన్ క్షత్తిరం గ్రామంలో కాలిపోతూ కుప్పకూలింది మిలటరీ హెలికాప్టర్. బుధవారం మధ్యాహ్నం 12.20 నిమిషాలకు ఈ ఘటన చోటుచేసుకుంది. కాతేరీ పార్క్ లో ఈ హెలికాప్టర్ కుప్పకూలింది. నీలగిరి ప్రాంతంలో సాధారణంగా పొగమంచు ఎక్కువగా వుంటుంది. దీంతో హెలికాప్టర్ ప్రమాదానికి గురైనట్టు తెలుస్తోంది. స్థానికులు కూడా ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. కాసేపట్లో వెల్లింగ్…
ఎయిడెడ్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయొద్దంటూ గత నెల రోజుల నుండి విద్యార్థులు ధర్నాలు నిర్వహిస్తున్నా ప్రభుత్వం సరిగా స్పందించలేదని మండిపడ్డారు ఎమ్మెల్సీ షేక్ షాబ్జి. విద్యార్ధుల సమస్యల పరిష్కారానికి అటు ప్రభుత్వాలు గానీ ఇటు జిల్లా అధికారులు గానీ స్పందించడం లేదన్నారు. కాకినాడ యుటిఎఫ్ హాల్లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్ షాబ్జి మాట్లాడారు. విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామని, ఈ విషయాన్ని రాబోయే శాసనసభ సమావేశాల్లో…
విశాఖలో మద్యం అమ్మకాల సొమ్ము అవకతవకల ఘటనతో ఎక్సైజ్ శాఖ అలెర్ట్ అయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మద్యం దుకాణాల్లో తనిఖీలు.. స్పెషల్ డ్రైవ్‌కు డెప్యూటీ సీఎం నారాయణ స్వామి ఆదేశించారు. స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా మద్యం అమ్మకాల సొమ్ము డిపాజిట్.. రికార్డులను పరిశీలించనున్నారు ఎక్సైజ్ ఉద్యోగులు. తమ పరిధిలోని దుకాణాలను కాకుండా.. జంబ్లింగ్ పద్దతిలో స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని ఎక్సైజ్ శాఖ సీఐలకు తెలిపింది. మొత్తం 2894 దుకాణాల్లో తనిఖీలు చేపట్టాలని సూచించింది. విశాఖ సహా…