Simhachalam Temple: వీడని అప్పన్న చందనోత్సవం వివాదం.. భక్తుల ఆగ్రహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖపట్నం సింహాచలం దేవస్థానం ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది. తాజాగా ఏర్పడిన చందనోత్సవం వివాదం ఇంకా వీడలేదు. దేవస్థానం అధికారుల వైఫల్యాలపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విచారణకు కమిటీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అంతరాలయ దర్శనాలు 10 వేలని చెప్పి 20 వేలకు పైగా టిక్కెట్లు జారీచేశారు. పరిమితికి మించి VVIP టిక్కెట్ల జారీతో లేని సమస్యలు తెచ్చిపెట్టుకుంది ఉత్సవ కమిటీ. సమన్వయం లోపంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు వేలాదిమంది భక్తులు.. ఘాట్ రోడ్ జామ్, గంటలకొద్దీ దర్శన సమయం, కనీస వసతుల కల్పించక పోవడంపై ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనలకు పిలుపునిచ్చాయి రాజకీయ పార్టీలు.

దేవస్థానం అధికారులపై మంత్రి ఆగ్రహం
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
సింహాచలం చందనోత్సవంలో భక్తుల ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. వీవీఐపీ టిక్కెట్లు కొనుగోలు చేసిన గంటల తరబడి క్యూ లైనల్లో ఉండిపోవడంపై భక్తులు మండిపడ్డారు. EO డౌన్ డౌన్ అంటూ భక్తులు నినాదాలు చేశారు. టైం స్లాట్ విధానం ఫెయిల్ అయిందని అప్పన్న స్వామి భక్తులు మండిపడుతున్నారు. కనీస సౌకర్యాలు కల్పించడంలో దేవస్థానం ఘోర వైఫల్యం చెందిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో భక్తులు బారిగేడ్లు విరగ్గొట్టారు. సింహాచలం అప్పన్న స్వామి దర్శనానికి వెళ్తున్న మంత్రి కొట్టు సత్యన్నారాయణకు భక్తుల నుంచి నిరసన సెగ ఎదురుకాక తప్పలేదు. క్యూ లైనల్లోనే భక్తులు నిరసనకు దిగడంతో గందరగోళం ఏర్పడింది.
Read Also: Astrology: ఏప్రిల్ 24, సోమవారం దినఫలాలు
భక్తులు నిరసన సెగలతో దేవాదాయమంత్రి కొట్టు సత్యనారాయణ పోలీస్ లపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. చందనోత్సవం నిర్వహణపై విశాఖ శ్రీశారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత ఘోరమైన ఏర్పాట్లు ఎప్పుడు చూడలేదు అంటూ వ్యాఖ్యానించారు. ఆలయంలో పోలీసులు జులుం ఎక్కువైంది అని ఆయన అన్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. గర్భాలయంలో ఆచారాలు మంటగలిపి ఇష్టారాజ్యాంగా వ్యవహరిస్తున్నారు.. ఈరోజు దర్శనానికి ఎందుకు వచ్చానా అనే బాధ కలుగుతుంది అని విశాఖ శ్రీశారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి అన్నారు. పేదల దేవుడి దగ్గర గందరగోళం సృష్టించారు..ఇటు విపక్షాలు కూడా అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఉత్సవ కమిటీ-దేవస్థాన కమిటీ మధ్య వివాదం వల్లే ఈ వైఫల్యం తలెత్తిందని భక్తులు విమర్శలు గుప్పిస్తున్నారు. మరి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఏం నివేదిక ఇస్తుందో… ఎవరిని బాధ్యులుగా చేస్తుందో చూడాలి.
Read Also: Shooting at Texas : హైస్కూల్ ప్రాం పార్టీలో ఫైరింగ్.. 9 మందికి తీవ్ర గాయాలు
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!