తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించింది బంజారాహిల్స్ లోని పుడింగ్ అండ్ మింక్ పబ్ కేసు. అక్కడ డ్రగ్స్ దొరకడంతో పోలీసులు అప్రమత్తం అయిన సంగతి తెలిసిందే. ఈకేసులో ఏం జరుగుతుందనే దానిపై ప్రజలు ఉత్సుకత చూపిస్తున్నారు. ఈ పబ్ డ్రగ్స్ కేసులో బంజారాహిల్స్ పోలీసులు తమ దూకుడు పెంచారు. మరో ముగ్గురిని నేడు విచారించనున్నారు బంజారాహిల్స్ పోలీసులు.
నిన్న టోనీ కేసులో నిందితులు శశికాంత్, సంజయ్ లను దాదాపు 7 గంటల పాటు విచారించారు పోలీసులు. డ్రగ్స్ కేసులో టోని,అభిషేక్ లతో సంబంధాలున్న వారి వివరాలు ఇప్పటికే సేకరించిన పోలీసులు, ఆ దిశగా ప్రశ్నలు వేస్తున్నారు. కీలక సమాచారం రాబడుతున్నట్టు తెలుస్తోంది. అభిషేక్ కాల్ డేటా లో మరి కొంత మంది పేర్లు వుండడంతో తీగలాగితే డొంకంతా కదిలినట్టుగా వుంది. పబ్ లో దొరికిన డ్రగ్స్, అభిషేక్ తో ఉన్న సంబంధాలపై నేడు మరో ముగ్గురిని ప్రశ్నించనున్నారు పోలీసులు. పుడ్డింగ్ పబ్ కు వచ్చిన వారిలో 45 మందికి డ్రగ్స్ చరిత్ర వుందని తెలుస్తోంది. గతంలో డ్రగ్స్ కేసుల్లో చిక్కిన వారితో సంబంధాలు కూడా వున్నాయని పోలీసులు చెబుతున్నారు.
Read Also: RBI: క్రెడిట్ కార్డుల జారీపై కీలక ఆదేశాలు.. అలా చేస్తే జరిమానా తప్పదని హెచ్చరిక