అడవుల జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ లో మావోయిస్టులు ఎంట్రీ ఇవ్వడంతో గ్రేహాండ్స్ బలగాలతోపాటు స్పెషల్ పార్టీ పోలీసులు రంగంలోకి దిగారు..రాష్ట్ర సరిహద్దు దాటి అన్నలు వచ్చారని పోలీసులు ప్రకటించినప్పటి నుంచి అడవులను జల్లెడ పడుతున్నారు..ఇంతకీ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఎంతమంది అన్నలు సంచరిస్తున్నారు…పోలీసు బలగాలెన్నీ…అడవుల్లో ఏంజరుగుతోంది? గిరిజన గ్రామాల్లో జనం బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు.
ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో సరిగ్గా రెండేళ్ల తర్వాత మళ్లీ మావోల ఎంట్రీ,పోలీసుల బూట్ల చప్పుళ్లు వినిపిస్తున్నాయి..అన్నల కోసం పోలీసులు హై అలెర్ట్ అయ్యారు..రాష్ట్ర సరిహద్దులతోపాటు ఏజెన్సీలోని మావోయిస్టు ప్రబావిత ప్రాంతాల్లో అనువనువు గాలిస్తున్నారు..ఒక విధంగా మావోయిస్టుల కోసం చక్ర వ్యూహం, పద్మవ్యూహాన్ని రచిస్తున్నారు పోలీసులు. ఒకటి రెండు కాదు 20కిపైగా ప్రత్యేక టీంలను రంగంలోకి దింపారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా అడవుల్లో గతకొద్ది రోజులుగా మావోయిస్టుల అలజడి మొదలైనట్లు పోలీసులు ప్రకటించారు. అప్పటి నుంచి కంటిమీద కునుకులేకుండా ఆయా జిల్లాల పోలీసులు అడవి బాటపట్టారు..తాజాగా కొమురం బీం జిల్లాకు హైదారాబాద్ నుంచి 6గ్రేహాండ్స్ బలగాలను రప్పించారు..వీటికి తోడు ఉమ్మడి జిల్లాలోని 15 ను ప్రత్యేక కూంబింగ్ పార్టీలు ఏజెన్సీ ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్ మొదలెట్టాయి.
ప్రత్యేక టీంలు మావోయిస్టుల కోసం వేట మొదలెడితే మిగతా పోలీసులు సైతం నెట్ వర్క్ ను అలెర్ట్ చేస్తున్నారు..మాజీలు,కొరియర్ల నుంచి సమాచారం సేకరిస్తున్నారు..ఏప్రాంతంలో సంచరిస్తున్నారు..వాళ్ల జాడ ఎక్కడా అంటూ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు ఖాకీలు..మరీ ముఖ్యంగా ఆదిలాబాద్ ,నిర్మల్,మంచిర్యాల,కొమురం భీం జిల్లాల పోలీసులు అయితే అనుమానిత వ్యక్తులు,కొత్తగా సరిహద్దులు దాటుతున్న వాహానాలపై ప్రత్యేక నిఘా పెట్టారు..మరీ ముఖ్యంగా మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిసారించి వాహనాల తనిఖీ చేస్తున్నారు..మావోయిస్టులు వెపన్స్ లేకుండా ,సివిల్ దుస్తువుల్లో తిరగుతున్నారనే సమాచారంతో ఏక్లూను వదిలిపెట్టడంలేదు.
ఏరియా డామినేషన్ టీంస్ తోపాటు పోలీసులు సైతం బైక్ లపై ఏజెన్సీ ప్రాంతాల్లో సివిల్ డ్రస్సుల్లో తిరుగుతున్నారు…ఇక అడవులు ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీలను మచ్చిక చేసుకునే ప్రయత్నాలతోపాటు కొత్త వ్యక్తుల సమాచారం రాబడుతున్నారు. మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్ తోపాటు ఆయన టీం సంచరిస్తుందన్నారు..మొత్తం పది నుంచి 15 మంది మావోలు వచ్చారంటున్నారు పోలీసులు.మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలపై పట్టున్న లేదా వారికి గురించి గత అనుభవాలున్న పోలీసులను ఉమ్మడి జిల్లాకు తీసుకొచ్చి ఆపరేషన్ మావోలో భాగస్వామ్యం చేస్తున్నారు..పాత కాలం బ్యాచ్ పోలీసుల ద్వారా మావోల వ్యూహ ప్రతివ్యూహాలను తెలుసుకుంటున్నారు. ఇలా ఎలా వీలైతే అలా మావోయిస్టులను తరమికొట్టాలన సంకల్పంతో పనిచేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇప్పటికే మావోయిస్టులు ఎవరు వచ్చారు..వారి క్యాడర్ ఏంటీ..వారి తలలకు ఎంత రివార్డ్ ఉందనే విషయాలను ఏజెన్సీ ప్రాంతాల్లో విస్తృతంగా పోలీసులు ప్రచారం చేస్తున్నారు..దీనికి తోడు సమాచారం మాకు బహుమహి మీకు అంటూ పోస్టుర్లు అంటిస్తున్నారు ఖాకీలు.
Read Also: Jana Reddy In Munugode: ఇన్నాళ్లు కష్టపడ్డా, ఇక ఆయాస పెట్టొద్దు
అన్నల సంచారంపై పోలీసుల అప్రమత్తతతో ఏజెన్సీ ప్రాంతాల్లో నిత్యం బూట్ల చప్పుళ్లు మోగుతున్నాయి. అడవుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ నెలకొంది..ప్రస్తుతం ఉమ్మడి జిల్లా అడవుల్లో20కి పైగా అంటే దాదాపు 500 మంది ప్రత్యేక పోలీసులతో అడవుల్లో మావోయిస్టుల కోసం గాలింపు ముమ్మరం చేశారు. ఈపోరులో ఎవ్వరిది పైచేయి అవుతుందో అనే సస్పెన్ష్ కొనసాగుతోంది.
Read Also:Pakistan Flood: పాకిస్తాన్‌లో భారీ వరదలు.. అంతర్జాతీయ సాయం కోసం అభ్యర్థన
(ఆదిలాబాద్ ప్రతినిధి సారంగపాణి సౌజన్యంతో..)