MLA Rohith Reddy: బండి సంజయ్ హిందుత్వం పేరిట ప్రజలని తప్పు దోవ పట్టిస్తే చూస్తూ ఊరుకొమని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ప్రశ్నించారు. భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో బండి సంజయ్ రాలేదు. బండి సంజయ్ మాటలు అబద్దమని మరోసారి రుజువైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్ లోని వేములవాడ లేదంటే తాండూరులో ను భద్రేశ్వరాలయంకు రావాలని ఛాలెంజ్ చేస్తున్నా అని తెలిపారు. ఇవాల్టి నుంచి తగ్గేదే లేదు… బీజేపీ నేతల ఆటలు సాగవంటూ రోహిత్ రెడ్డి అన్నారు. బీజేపీ నేతలు తమ తప్పును కప్పి పుచ్చుకోవడనికి అనేక రకాల అబద్ధాలు చెబుతున్నారని తెలిపారు. ఈడి వ్యవహారాన్ని మేము తప్పు బడితే ఎందుకు ఇంత ఉలిక్కి పడుతున్నారని ఎద్దేవ చేశారు. కావాలనే బీజేపీ నేతలు, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో బిజినెస్ మన్ లను, కీలక నేతలను టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు. నాపై బీజేపీ నేతలు చేసిన ఆరోపణలకు అమ్మవారి దేవాలయం ముందు సవాల్ విరిసిన సంజయ్ ఎందుకు స్పందించడం లేదని అన్నారు.
Read also: Gidugu Rudraraju: పోలవరం ప్రాజెక్టు సందర్శనకు అనుమతివ్వండి
బండి సంజయ్ హిందుత్వం పేరిట ప్రజలని తప్పు దోవ పట్టిస్తే చూస్తూ ఊరుకొమని హెచ్చారించారు. భాగ్య లక్ష్మి అమ్మవారి దేవాలయనికి సంజయ్ రాలేదంటే నీ తప్పును నువ్వు ఒప్పుకున్నట్ల అంటూ తెలిపారు. రఘునందన్ రావు దగ్గరకు సహాయం కోసం వచ్చిన మహిళకు మత్తుమందు ఇచ్చి లోబర్చు కున్నావని ఆరోపించారు. స్ట్రింగర్ గా ఉన్న నువ్వు వందల కోట్లు ఎలా సంపాదించావని, పఠాన్ చెరువులో ఉన్న చాలా మందిని బెదిరించడం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. పది కోట్ల విల్లా, ఖరీదైన హోటల్ లో రూంలు, కోట్లాది రూపాయల ఆస్తులు ఎలా వచ్చాయని, పేరున్న అడ్వకేట్ గా చెప్పుకుంటున్న రఘు నందన్ రావు కేసుల పేరిట ఆడవారిని మోసం చేయడం నిజం కాదా? అని మండిపడ్డారు. ఏంఐఎం నేతలతో టచ్ లో ఉన్నది సుద్దపూస రఘునందన్ రావు కదా? రఘునందన్ ఆరోపణలు చేసిన రిస్టార్ దగ్గర వాచ్ మెన్ పదవి ఇప్పిస్తా అని సంచలన వ్యాఖ్యలు చేశారు. 15 రోజులు పనిచేసి నా ఆస్తి అవునో కాదో తేల్చి చెప్పు అంటూ ఎద్దేవ చేశాఉ. నేను అమెరికాలో పైలట్ కోర్సు చేసినా.. అవునో కాదో తెలుసుకో అన్నారు. అవసరం అయితే ఫ్లైట్ టిక్కెట్లు నేనే ఏర్పాటు చేస్తా అని రోహిత్ రెడ్డి తెలిపారు.
Fake Document: బతికుండగానే బరితెగించారు.. విచారణలో బయటపడ్డ భాగోతం