Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం.. హైద్రాబాద్ కు చెందిన ప్రవీణ్ కుమార్ పేరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో హైదరాబాద్ కు చెందిన ప్రవీణ్ కుమార్ పేరు తెరమీదకు వచ్చింది. హైదరాబాద్ కు చెందిన చార్డెడ్ అకౌంటెంట్ బుచ్చిబాబుకు ప్రవీణ్ సన్నిహితుడిగా ఉన్నాడు ఈడీ చార్జీషీట్ లో ప్రవీణ్ పేరు నమోదు చేసి.. ప్రవీణ్ కుమార్ పాత్రపై ఈడీ అధకారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక గతంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించిన సమయంలో ప్రవీన్ నివాసంలో ఈడీ అధికారులు రూ.24లక్షలు సీజ్ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో దుబాయ్ కంపెనీతో పాటు పై కంపెనీకి నిధులు మళ్లించారనే అభియోగాలపై ఈడీ విచారణ చేపట్టింది.
Read also: Pineapple Juice: పైనాపిల్ జ్యూస్‌తో లాభాలే కాదు.. నష్టాలు కూడా!
Also Read
- Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
- UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
- UPI Charges: మళ్లీ క్యాష్ ఎకానమీ వైపు భారత్? రిటైలర్ల ఆందోళన
- Cooking Oil Prices: పండగల వేళ సామాన్యుడికి ఊరట.. వంటనూనెలపై దిగుమతి కేంద్రం కీలక అడుగు!
గతంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ హైదరాబాద్ ప్రధాన కార్యాలయంలో ఈడీ, సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ పత్రాల ఆధారంగా విచారణ చేపట్టారు. ఈ కేసులో ఇప్పటికే తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురిని ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రవీణ్ పేరు తెరపైకి రావడంతో ఈ కేసులో మరికొందరి పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం లేకపోలేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీ మద్యం కుంభకోణంతో ప్రవీణ్‌కుమార్‌కు ఏ మేరకు సంబంధం ఉందనే దానిపై ఈడీ అధికారులు దర్యాప్తు చేయనున్నారు.
Read also: Love Affair: ఇద్దరి ప్రాణాలు బలితీసుకున్న ప్రేమ..
ఢిల్లీ మద్యం కుంభకోణంలో బీఆర్ఎస్ నేతల హస్తం ఉందని బీజేపీ ఆరోపించింది. ఈ ఆరోపణలను బీఆర్‌ఎస్ నేతలు ఖండించారు. గతంలో ఈడీ అరెస్ట్ చేసిన దినేష్ అరోరా రిమాండ్ రిపోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు బయటకు వచ్చింది. దీంతో ఈ కేసులో సమాచారం కోసం సీబీఐ అధికారులు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సమాచారం తీసుకున్న విషయం తెలిసిందే.. సెక్షన్ 160 కింద నోటీసులు అందజేసి కమిటీ నుంచి సమాచారం సేకరించారు. అదే రోజు కవితకు సీబీఐ అధికారులు మరో నోటీసు ఇచ్చారు. ఢిల్లీ మద్యం కుంభకోణంపై ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను సీబీఐ అధికారులు విచారించారు. మనీష్ సిసోడియా నివాసం, కార్యాలయం, బ్యాంకుల్లోనూ సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు హైదరాబాద్ కు చెందిన ప్రవీణ్ పేరు తెరపై రావడంతో రాజకీయ నాయకుల్లో గుబులు నెలకొంది. ఎవరుపేర్లు బయటకు వస్తాయో అన్న విషయంపై ఉత్కంఠ నెలకుంది.
Pineapple Juice: పైనాపిల్ జ్యూస్‌తో లాభాలే కాదు.. నష్టాలు కూడా!
తాజావార్తలు
-
Hyderabad Liberation Day : హైదరాబాద్ విమోచన దినోత్సవం.. సెప్టెంబర్ 17 చరిత్ర ఇదే!
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!