తృణమూల్ కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకుని కేంద్ర సంస్థల దుర్వినియోగానికి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ సోమవారం ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అయితే మోషన్‌ను చదివే సమయంలో తమ సభ్యులు అసెంబ్లీకి హాజరుకావడం అవినీతి కేసులకు మద్దతు ఇచ్చినట్లే అవుతుందని పేర్కొంటూ బీజేపీ సభను వాకౌట్ చేసింది.
లిక్కర్ స్కాంలో ఈడీ విచారణకు ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు. ఈడీ ఆఫీసు చేరుకున్న కవిత… అందరికీ అభివాదం చేస్తూ లోపలికి వెళ్లారు. ఈడీ ఆఫీస్ గేటు దగ్గర అభిమానులకు.. పిడికిలి బిగించి అభివాదం చేశారు. కవితకు మద్దతుగా ఈడీ ఆఫీసు గేట్ వరకూ వచ్చిన మంత్రి శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ నేతలు వచ్చారు. ఈడీ ఆఫీస్ పరిసరాల్లో భారీగా పోలీసులు మోహరించారు. కవిత వెంట ఆమె భర్త అనిల్, లాయర్లు సైతం ఉన్నారు. అయితే, వాళ్లను ఆఫీస్…
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో భారత రాష్ట్ర సమితి నాయకురాలు, ఎమ్మెల్సీ కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించనుంది. ఇదే కేసులో మనీష్ సిసోడియాను అరెస్ట్ చేశారు.
ఆర్జేడీ నేత, బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించింది. భూ కుంభకోణం కేసుకు సంబంధించి దేశ రాజధానిలోని తేజస్వీ యాదవ్ నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ శుక్రవారం దాడులు నిర్వహించింది.
ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఐడీతో పాటు సమాంతరంగా విచారణ చేస్తున్న ఈడీ దూకుడుగా వ్యవహరిస్తోంది.మనీలాండరింగ్ పాల్పడిన నలుగురిని ఈడీ అరెస్టు చేసింది. ప్రభుత్వం నుండి కొల్లగొట్టిన రూ.370 కోట్లను విదేశీ కంపెనీలకు మళ్లించినట్లు ఈడీ గుర్తించింది. ఈకేసులో సౌమ్యాద్రి శేఖర్ బోస్, వికాస్ కన్విల్కర్, సురేష్ గోయల్, ముకుల్ చంద్ర అగర్వాల్ లను అరెస్ట్ చేశారు. విశాఖ స్పెషల్ కోర్టులో వీరిని ఈడీ హజరుపర్చింది. ఆ నలుగురినీ విచారణ కోసం…
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన మనీష్ సిసోడియాకు మరో షాక్ తగిలింది. సీబీఐ అరెస్ట్ చేసిన అనంతరం బెయిల్ మంజూరు కాకముందే మనీ లాండరింగ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు మనీష్ సిసోడియాను ఈడీ అరెస్ట్ చేసింది.
ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులపై ఇప్పుడు హాట్ టాపిక్. ఇవాల ఢిల్లీకి ఈడీ కార్యాలనికి రావాలని ఎమ్మెల్సీ కవితకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.. అయితే ఈనేపథ్యంలో కవిత ఈడీకి లేఖ రాశారు. దీంతో ఈ వ్యవహారం కాస్త సంచలంగా మారింది.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన ప్రముఖ వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లైను ఈడీ అధికారులు రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరుపర్చారు. ఈ కేసులో ఈడీ వాదనలు వినిపించింది. అరుణ్ రామచంద్ర పిళ్లైని ఏడు రోజులు కస్టడీకి ఇవ్వాలని ఈడీ న్యాయస్థానాన్ని కోరింది. పిళ్లై విచారణకు సహకరించడం లేదని ఈడీ న్యాయస్థానానికి తెలిపింది.