ఉపాధ్యాయ సంఘాలకు వైఎస్ షర్మిళ మద్దతు తెలిపారు. జీఓ317 రద్దు చేయాలని, జీఓ 317అంతా తప్పుల తడకగా ఉందని షర్మిళ అన్నారు. స్థానికులకు ఉద్యోగాలు దక్కాలని తెలంగాణ తెచ్చుకున్నామన్నారు. ఈ జీఓ స్థానికులనే స్థానికేతరులను చేసిందన్నారు.
Read Also:విద్య రంగానికి ఎక్కువ నిధులు కేటాయిస్తున్న ప్రభుత్వం మాదే: హరీష్‌రావు
పుట్టిన ఊరు, చదువుకున్న ఊరు స్థానికత కాదని ఎలా చెప్తారు అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాజకీయ లబ్దికోసం జూనియర్, సీనియర్ ఉద్యోగుల మధ్య పంచాయతీ పెడుతున్నారని చెప్పారు. కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో మరో 20-30 ఏళ్ల వరకు జిల్లా స్థాయి పోస్టులు ఖాళీగా ఉండే పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో నిరుద్యోగ యువతను ఇంకా చంపాలని చూస్తున్నారా? అంటూ కేసీఆర్ సర్కార్‌ను షర్మిళ నిలదీశారు.