Eluru Police: వివిధ అవసరాలతో ఇబ్బంది పడే పేద ప్రజల ఇబ్బందులను తొలగించేందుకు ఏలూరు పోలీసులు సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ఇళ్లలో వాడకుండా ఉండే పాత బట్టలు ఎలక్ట్రానిక్ వస్తువులు పిల్లలు ఆడుకునే బొమ్మలను ఇతరులు ఉపయోగించుకునే విధంగా అవకాశాన్ని కల్పిస్తున్నారు.. కైండ్ నెస్ వాల్ పేరుతో ఏర్పాటు చేసిన వినూత్న ప్రయోగానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని ఏలూరు జిల్లా పోలీసులు ఆశిస్తున్నారు..
Suspects : ఏలూరులో ముగ్గురు యువకులుతుపాకీతో పోలీసులకు పట్టుబడ్డారు. అప్రమత్తమైన పోలీసులు తుపాకీ ఎక్కడిది, ఎవరిచ్చారు, ఎందుకు వెంట పెట్టుకుని తిరుగుతున్నారు, ఎలాంటి నేరానికి పాల్పడనున్నారు అనే కోణాల్లో వారిని విచారణ చేస్తున్నారు. ఏలూరు టూటౌన్ కొత్తపేటలో గస్తీ నిర్వహిస్తున్న మహిళా ఎస్సై, సిబ్బందికి రోడ్డు పక్కగా ఆగి ఉన్న కారు కనిపించింది. లోపల ముగ్గురు యువకులు ఉండటంతో వారిని వివరాలు అడిగారు. వారు చెప్పిన సమాధానాల్లో స్పష్టత లేకపోవడంతో కారంతా గాలించగాతుపాకీ దొరికింది. వెంటనే ఆ…
ఏలూరు పోలీసులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. ఈ సందర్భంగా ఆయన ట్వీట్ చేశారు. గత త్రైమాసికంలో దొంగలు ఓ బైకును దొంగలించారు. నీలి అలివేణి అనే మహిళ తన తలసేమియా బాధిత కుమార్తెను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ఉపయోగించిన బైక్ ను ఎత్తుకెళ్లారు. అయితే.. బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకొని తిరిగి అప్పగిస్తున్నప్పుడు ఆమె భావోద్వేగాలు కదిలించాయని చంద్రబాబు తెలిపారు.