ట్రాన్స్ కో విజిలెన్స్ అధికారులతో ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. విద్యుత్ రంగంలో అక్రమాలపై ఉక్కుపాదం మోపుతున్నామన్నారు. విద్యుత్ చౌర్యం, అనధికారిక వినియోగంను నియంత్రించాలని అధికారులను ఆదేశించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. విజిలెన్స్ అధికారులు తనిఖీలను ముమ్మరం చేయాలన్నారు. గృహ వినియోగంతో పాటు పారిశ్రామిక వినియోగం పైనా ఆకస్మిక తనిఖీలు చేయాలి. విద్యుత్ నష్టాలను తగ్గించడంలో విజిలెన్స్ కీలక పాత్ర పోషించాలి. మొక్కుబడిగా పనిచేస్తే కుదరదు. అన్ని జిల్లాల ఎస్పీలతో సంయుక్త…