ట్రాన్స్ కో విజిలెన్స్ అధికారులతో ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. విద్యుత్ రంగంలో అక్రమాలపై ఉక్కుపాదం మోపుతున్నామన్నారు. విద్యుత్ చౌర్యం, అనధికారిక వినియోగంను నియంత్రించాలని అధికారులను ఆదేశించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. విజిలెన్స్ అధికారులు తనిఖీలను ముమ్మరం చేయాలన్నారు.
గృహ వినియోగంతో పాటు పారిశ్రామిక వినియోగం పైనా ఆకస్మిక తనిఖీలు చేయాలి. విద్యుత్ నష్టాలను తగ్గించడంలో విజిలెన్స్ కీలక పాత్ర పోషించాలి. మొక్కుబడిగా పనిచేస్తే కుదరదు. అన్ని జిల్లాల ఎస్పీలతో సంయుక్త సమావేశాలు ఏర్పాటుచేయాలి. వ్యవసాయ మీటర్లపై ప్రతిపక్షాలది అనవసరపు రాద్దాంతం అన్నారు. మీటర్ల వల్ల రైతుల్లో జవాబుదారీతనం పెరుగుతుంది. రైతులు వినియోగించే విద్యుత్ చార్జీలను ప్రభుత్వమే వారి ఖాతాకు జమ చేస్తుంది.
విజిలెన్స్ పటిష్టంగా ఉంటేనే విద్యుత్ చోరీలు, దుర్వినియోగం, విద్యుత్ నష్టాలను నియంత్రించ గలుగుతామని 2019-20లో విద్యుత్ సరఫరా, పంపిణీలో 13.02 శాతం నష్టాలు ఉంటే…2020-21 నాటికి 9.83 శాతంకు తగ్గించేందుకు ముఖ్యమంత్రి తీసుకున్న చర్యలే కారణం అన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఐఆర్డిఎ మీటర్లను బిగించడం, ఓవర్ లోడ్ సెక్షన్ లలో అదనంగా ఫీడర్లను ఏర్పాటు చేయాలి. అదనపు లోడ్ డిమాండ్ ఉన్న చోట్ల కొత్త డిటిఆర్ లను ఏర్పాటు చేయాలి.
విద్యుత్ చౌర్యంపై అనుమానం ఉన్న ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేయాలి. అధికారులు ఇన్నోవేటీవ్ గా ఆలోచించాలని, మొక్కుబడిగా పనిచేస్తే కుదరదు. విద్యుత్ అక్రమాలను అరికట్టేందుకు విజిలెన్స్ అధికారులతో పాటు జిల్లాల్లోని పోలీస్ యంత్రాంగం సహకారం కూడా తీసుకోవాలని మంత్రి విద్యుత్ అధికారులకు, విజిలెన్స్ అధికారులకు సూచించారు.
Ashokgajapathi Raju: భావితరాలకు భారంగా అప్పులు