అల్లూరి జిల్లా అనంతగిరి మండలంలోని రొంపల్లి పంచాయతీ గిరిజన ‘గూడెం’లో తొలిసారి విద్యుత్ వెలుగులు వెలిగాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో స్వాతంత్ర్యం వచ్చిన 75 ఏళ్ల తర్వాత మొదటిసారి విద్యుత్ కనెక్షన్ వచ్చింది. 17 కుటుంబాలు నివసించే గూడెంకి 9.6 కి.మీ పొడవున 217 విద్యుత్ స్తంభాలను అధికారులు ఏర్పాటు చేశారు. ప్రతి ఇంటికీ ప్రభుత్వం తరఫున 5 బల్బులు, ఒక ఫ్యాన్ అందించారు. సుమారు రూ.80 లక్షల వ్యయంతో పర్వత అడవి ప్రాంతంలో…
విశ్వంలోని ఇతర గ్రహాలపై మానవ మనుగడ కోసం ప్రయోగాలు చేస్తున్న వేళ.. భూమిపై మాత్రం ఇప్పటి వరకు విద్యుత్ సరఫరా లేని గ్రామాలు ఉండడం ఆశ్చర్యం కలిగించకమానదు. కారణాలు ఏవైనా ఇంకా చీకటిలోనే గ్రామాలు మగ్గుతున్నాయి. అయితే ఇటీవలి కాలంలో కరెంట్ సదుపాయం లేని గ్రామాలకు విద్యుత్ ను ఏర్పాటు చేసి వెలుగులు నింపుతున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి జిల్లా మాడుగుల గ్రామానికి తొలిసారిగా విద్యుత్ వచ్చింది. Also Read:Bihar: బీహార్ ఓటర్ల జాబితా నుంచి…
రాష్ట్ర విద్యుత్ అవసరాలను తీర్చేందుకు యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌లోని 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రెండో యూనిట్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతికి అంకితం చేశారు. థర్మల్ స్టేషన్‌లోని పైలాన్‌ను ముఖ్యమంత్రి తమ చేతుల మీదుగా ఆవిష్కరించారు.
తెలంగాణలో కొత్త విద్యత్ పాలసీ తీసుకువస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. శ్రీశైలం ప్రాజెక్ట్ను సమీక్షించి విద్యత్ సమస్యలు తెలుసుకొని పరిస్కార మార్గాల పై చర్చించారు . ప్రజలకు న్యాయమైన విద్యుత్ అందించడమే ధ్యేయమని భట్టి చెప్పారు. నాలుగో యూనిట్ పునరుద్ధరణకు రూ.2 కోట్ల అంచనా వ్యయం మంజూరు చేయనున్నారు. అంతరాయం లేకుండా విద్యత్ అందించడమే తమ లక్ష్యం అన్ని తెలిపారు మరికొన్ని వివరాల కోసం కింద వీడియో చూడండి..
కొద్దిరోజుల్లో వర్షాకాలం ప్రారంభం కానున్న నేపథ్యంలో యావత్ విద్యుత్తు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. శనివారం సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.
Electricity Demand: రాష్ట్రంలో కరెంట్ షాక్ మొదలైంది. ఎండ తీవ్రత పెరుగుతుండడంతో విద్యుత్ డిమాండ్ విపరీతంగా పెరిగింది. బోరుబావుల కింద వేసిన యాసంగి పంటలను కాపాడుకునేందుకు విద్యుత్తు వినియోగం గణనీయంగా పెరిగింది.
సెక్రటేరియట్లో విద్యుత్, ఆర్టీసీపై సమీక్ష ముగిసింది. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ, కొనుగోలుపై ఉన్నతాధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. 2014 జూన్ 2 కంటే ముందు పరిస్థితులు, తర్వాత విద్యుత్ ఉత్పత్తి, కొనుగోలు, ప్రస్తుత పరిస్థితులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు. మరోవైపు.. సీఎండీ ప్రభాకర్ రావు గైర్హాజరు కావడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా.. విద్యుత్, ఆర్టీసీ పై అసెంబ్లీ సమావేశాల తర్వాత మరోసారి రివ్యూ చేస్తానని సీఎం రేవంత్ రేవంత్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన రంగానికి సంబంధించి పలు ప్రారంభోత్సవాలు, పలు ప్రాజెక్టుల పనులకు వర్చువల్ పద్ధతిలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. సబ్‌స్టేషన్లు, విద్యుత్ ప్రాజెక్టులకు కలిపి మొత్తంగా సుమారు రూ.6600 కోట్ల విలువైన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. పునరుత్పాదక విద్యుత్ రంగంలో హెచ్‌పీసీఎల్‌తో రూ.10వేల కోట్ల విలువైన ప్రాజెక్టుపై అవగాహనా ఒప్పందం జరిగింది.
Vijayapura : సకాలంలో కరెంటు ఇవ్వకపోవడంతో కర్ణాటక రైతులు విసుగు చెందిపోయారు. దీంతో హెస్కామ్ సబ్ స్టేషన్ యూనిట్ ఆవరణలోకి మొసలిని తీసుకొచ్చిన ఘటన విజయపూర్ జిల్లా కొల్హార తాలూకా రోనిహాల్ గ్రామంలో చోటుచేసుకుంది.