Supreme Court: బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు జరపాలని సుప్రీంకోర్టులో కాంగ్రెస్ పిటిషన్.. నేడు విచారణ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lok Sabha Election 2024: బ్యాలెట్ పేపర్ ( Ballot Paper ) ద్వారా ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిల్‌ను సుప్రీంకోర్టు ( Supreme Court ) నేడు (శుక్రవారం) విచారించనుంది. లోక్‌సభ ఎన్నికల ( Lok Sabha Election )ను బ్యాలెట్ పేపర్ ద్వారా నిర్వహించేలా భారత ఎన్నికల సంఘా ( EC )న్ని ఆదేశించాలని పిటిషన్‌లో కాంగ్రెస్ ( Congress ) పార్టీ డిమాండ్ చేసింది. సుప్రీంకోర్టు ( Supreme Court ) వెబ్‌సైట్‌లో ప్రచురించిన కారణాల జాబితా ప్రకారం.. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్‌లతో కూడిన ధర్మాసనం ఇవాళ ఈ కేసును విచారించనుంది. ఈవీఎంలపై ప్రతిపక్ష పార్టీల ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ మధుర జిల్లా కమిటీ ప్రధాన కార్యదర్శి దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు.
Read Also: WPL 2024: నేడు ముంబై, బెంగళూరు మధ్య ఎలిమినేటర్ మ్యాచ్.. ఢిల్లీని ‘ఢీ’ కొట్టేదెవరు?
Also Read
- Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
- Nana Patekar Funeral: నానా పటేకర్ చివరి కోరిక ఇదే.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు.. ఎక్కడంటే?
- Kitchen Sink Tips: గిన్నెలు తోమేటప్పుడు బట్టలు తడుస్తున్నాయా? రూపాయి ఖర్చు లేకుండా ఈ 5 ట్రిక్స్ ట్రై చేయండి
- Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే "వెజ్ ఆమ్లెట్".. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
కాగా, ఇందులో ఈవీఎంల ( EVMS) ద్వారా ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్‌కు హక్కు కల్పించే ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 61ఏను రద్దు చేయాలని కాంగ్రెస్ (Congress) పార్టీ విజ్ఞప్తి చేసింది. బూత్ క్యాప్చరింగ్, బ్యాలెట్ బాక్సులను అడ్డుకోవడం, అక్రమ ఓట్లు, పేపర్ వృధా లాంటి బ్యాలెట్ పేపర్‌పై ( Ballot Paper ) వాదనలు అన్యాయమైనవి అని తెలిపింది. అయితే ఈవీఎం ( EVMS) మెషీన్‌లో 2,000 నుంచి 3,840 ఓట్లు నిల్వ ఉన్నాయని పిటిషన్‌లో చెప్పుకొచ్చింది. అంటే ప్రత్యక్ష ఎన్నికల విధానంలో ఒక్కో నియోజకవర్గానికి 50 ఈవీఎం ( EVMS) మిషన్ల డేటాను తారుమారు చేయడం ద్వారా లక్ష నుంచి 1.92 లక్షల ఓట్ల వరకు మోసం జరిగే అవకాశం ఉంది అని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ఈవీఎం లేదా బ్యాలెట్ పేపర్‌తో సంబంధం లేకుండా ఎన్నికల ఫలితాలు ఒకే విధంగా ఉండటంతో ఈవీఎంల పనితీరుపై, అలాగే అధికార పార్టీపై అనేక అనుమానాలు రేకెత్తిస్తున్నదని కాంగ్రెస్ (Congress) పిటిషన్‌లో పేర్కొనింది. ఈ పిటిషన్ ను నేడు సుప్రీంకోర్టు ( Supreme Court ) ధర్మాసనం విచారణ చేయనుంది.
తాజావార్తలు
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
PBKS-IPL 2027: పంజాబ్ కింగ్స్‌కు భారీ షాక్.. ఐపీఎల్ 2027 ముందు ఇద్దరు కోచ్‌లు అవుట్!
-
Airtel Postpaid Plans Price Hike: Airtel కస్టమర్లకు షాక్.. పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్ ధరలు భారీగా పెంపు
-
Nana Patekar Funeral: నానా పటేకర్ చివరి కోరిక ఇదే.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు.. ఎక్కడంటే?
-
Kitchen Sink Tips: గిన్నెలు తోమేటప్పుడు బట్టలు తడుస్తున్నాయా? రూపాయి ఖర్చు లేకుండా ఈ 5 ట్రిక్స్ ట్రై చేయండి
ట్రెండింగ్
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!