టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీలో ఎవరినీ నమ్మడం లేదా? అంటే అవుననే సంకేతాలే విన్పిస్తున్నాయి. టీడీపీ గత ఎన్నికల్లో దారుణంగా ఓటమి పాలవడం దగ్గరి నుంచి, పార్టీలోని సీనియర్లంతా వరుసబెట్టి బయటికి వెళుతుండటం చూస్తుంటే ఈ విషయం ఇట్టే అర్థమైపోతుంది. ఇక తాజాగా ఆపార్టీకి చెందిన ఎన్నికల వ్యూహకర్తకు సైతం చంద్రబాబు గుడ్ బై చెప్పినట్లు వార్తలు విన్పిస్తున్నాయి. దీంతో రాబోయే ఎన్నికల్లోనూ చంద్రబాబు వ్యూహాలే ఆపార్టీకి శరణ్యంగా మారనున్నాయనే టాక్ ఆపార్టీలో విన్పిస్తోంది. ఇప్పటికే ఈమేరకు…
వచ్చే ఏడాది దేశంలో 5 రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఐదు రాష్ట్రాల్లో గోవా కూడా ఒకటి. దేశంలో బీజేపీని ఎలాగైనా ఓడించాలనే లక్ష్యంతో ప్రతిపక్షాలన్ని కలిసికట్టుగా ప్రయత్నం చేస్తున్నాయి. బెంగాల్ ఎన్నికల తరువాత దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా పనిచేసే పార్టీలు ఒక్కటిగా కలిసి పనిచేసుందుకు ముందుకు వస్తున్నాయి. కాగా గోవాలో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉండటంతో బీజేపీకి ఇప్పటి వరకు కలిసి వచ్చింది. కాంగ్రెస్ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఆప్ ఇప్పటికే రంగంలోకి…
వైసీపీ అధికారంలోకి వచ్చి పట్టుమని రెండున్నరేళ్లు కూడా పూర్తి కాలేదు. అప్పుడే టీడీపీ నేతలు అసెంబ్లీని రద్దును చేసి జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు వెళ్లాలంటూ సవాల్ విసురుతున్నారు. ఇప్పటికిప్పుడు అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళితే ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. క్లియర్ కట్ గా వైసీపీనే మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని సర్వేలు బల్లగుద్ది చెబుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ నేతలు మాత్రం మేకపోతు గంభీర్యం ప్రదర్శిస్తుండటం రాజకీయంగా ఆసక్తిని రేపుతోంది. 2019 ఎన్నికల్లో మొదలైన…
రష్యాలోని దిగువ సభ డ్యూమాకు ఇటీవలే ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలకు సంబందించిన ఫలితాలు పుతిన్ పార్టీకి అనుకూలంగా రావడంతో ఆ పార్టీ సంబరాలు చేసుకుంటోంది. దిగువ సభ డ్యూమాలో 450 స్థానాలు ఉండగా, అందులో దామాషా పద్దతిప్రకారం 225 స్థానాలకు ఎన్నికలు జరగ్గా అందులో 198 స్థానాల్లో ఇప్పటికే పుతిన్ పార్టీ యునైటెడ్ రష్యా ఆధిక్యంలో ఉన్నది. యునైటెడ్ రష్యా పార్టీ 49.8 శాతం ఓట్లను సాధించింది. కాగా, ప్రత్యర్థ పార్టీ రష్యా కమ్యునిస్ట్ కేవలం…
వచ్చే ఏడాది గుజరాత్‌కు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలపై అధికార బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దృష్టి సాయించాయి. ఇప్పటి నుంచే కసరత్తులు చేస్తున్నాయి. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని గుజరాత్ ముఖ్యమంత్రిని కూడా మార్చేసింది బీజేపీ అధిష్టానం. అటు కాంగ్రెస్ కూడా ధీటుగా ప్రణాళికలు రచిస్తున్నది. ఆప్ సైతం తన ప్రభావాన్ని చూపేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. కాగా, ఇప్పుడు మరోపార్టీ కూడా గుజరాత్ ఎన్నికలపై కన్నేసింది. అదే ఎంఐఎం. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌లో బలమైన పార్టీగా నిలిచిన ఎంఐఎం…
త్వరలోనే కర్ణాటక రాష్ట్రంలో హనేగల్, సిందగీ నియోజక వర్గాలకు ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఉప ఎన్నికల్లో బీజేపి తప్పకుండా గెలిచి పట్టు నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప తప్పుకున్నాక జరగబోతున్న ఉప ఎన్నికలు కావడంతో ఎలాగైనా సరే గెలిచి పట్టు నిరూపించుకోవాలి. ఇది ఆ పార్టీకి అగ్ని పరీక్ష లాంటివి. రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని యడ్యూరప్ప, జగదీశ్ షెట్టర్, డీవీ సదానంద గౌడ, నళిన్ కుమార్ కటిల్ లతో నాలుగు బృందాలను…
త్వరలోనే ఫిలిప్పిన్స్ దేశానికి ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికల్లో అధ్యక్షుడిగా పోటీ చేసేందుకు స్టార్ బాక్సర్ మన్నీ పాక్వియానో సిద్ధం అవుతున్నారు. చాలా కాలంగా పాక్వియానో అధ్యక్ష పదవిని చేపట్టే అవకాశం ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఆ ఊహాగానాలకు పాక్వియానో తెరదించాడు. ఎన్నికల్లో పోటీచేసేందుకు సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. మన్నీ పాక్వియానో చిన్నతనంలో దుర్భరమైన జీవితాన్ని గడిపాడు. తిండికి లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అయితే, బాక్సింగ్ క్రీడను ఎంచుకున్నాక ఆయన జీవితం మారిపోయింది. అంచలంచెలుగా…
ఏపీ సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో.. ఎన్నికలపై హాట్ హాట్ చర్చ జరిగినట్టు తెలుస్తోంది.. ఇవాళ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది కేబినెట్.. మరోవైపు.. వైసీపీ ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిపోయినట్టు సమాచారం.. ఇప్పటి నుంచే ఎన్నికలకు వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సీఎం వైఎస్ జగన్ సంకేతాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది.. ఎన్నికల కోసం వచ్చే ఏడాది నుంచి అంతా రంగంలోకి దిగాలని కూడా పీకే టీమ్‌ను ఆదేశించినట్టు సమాచారం.. వచ్చే ఏడాది నుంచి…
ఈనెల 30 వ తేదీన పశ్చిమ బెంగాల్‌కు ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. భవానీ పూర్ నియోజక వర్గానికి జరిగే ఉప ఎన్నికలపై అందరి దృష్టి నిలిచింది. ఈ ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ నుంచి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీలోఉండగా, బీజేపీ నుంచి ప్రియాంక తిబ్రేవాల్ పోటీలో ఉన్నారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విజయం నల్లేరుపై నడకే అయినప్పటికీ నందిగ్రామ్ ఓటమి తరువాత మమతా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇక ఇదిలా ఉంటే, బెంగాల్ అసెంబ్లీ…