హుజురాబాద్ ఉప ఎన్నికలో ఈటల రాజేందర్ విజయం 22వ రౌండ్ లో కూడా బీజేపీ హవా… బీజేపీ 1,07,022 ఓట్లు, టీఆర్ఎస్ 83,167 ఓట్లు. 23,855 ఓట్ల ఆధిక్యంతో గెలిచిన ఈటల 21వ రౌండ్ లోనూ బీజేపీ హవా. బీజేపీ 1,01,732 ఓట్లు, టీఆర్ఎస్ 78,997 ఓట్లు. 21వ రౌండ్ ముగిసే సరికి బీజేపీకి 22,735 ఓట్ల ఆధిక్యం. 20వ రౌండ్ లోనూ బీజేపీ హవా… 20వ రౌండ్ లో బీజేపీ కి 1,474 ఓట్ల ఆధిక్యం…
దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని మూడు లోక్‌సభ, 29 అసెంబ్లీ నియోజకవర్గాలకు అక్టోబర్ 30న ఉప ఎన్నికలు జరిగాయి. ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు, ఫలితాలు కాసేపట్లో వెలువడనున్నాయి. అసోం- 5, బంగాల్- 4, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, మేఘాలయ- 3, బిహార్, కర్ణాటక, రాజస్థాన్- 2, ఆంధ్రప్రదేశ్, హరియాణా, మహారాష్ట్రా, మిజోరాం, తెలంగాణలో ఒక్కో స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయి. అక్టోబర్ 30న ఉప ఎన్నికలు జరిగిన స్థానాల్లో గతంలో బీజేపీ ఆరు,…
తెలుగు రాష్ట్రాల్లో శనివారం నాడు ఉప ఎన్నికల హడావిడి నెలకొంది. ఏపీలోని బద్వేలు, తెలంగాణలోని హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో శనివారం నాడు ఉప ఎన్నికలు జరగనున్నాయి.ముఖ్యంగా హుజురాబాద్‌లో పోటీ టీఆర్ఎస్, బీజేపీల మధ్య ఉండనుంది. టీఆర్ఎస్ తరఫున గెల్లు శ్రీనివాస్ యాదవ్, బీజేపీ తరఫున ఈటెల రాజేందర్ బరిలో ఉన్నారు. ఇప్పటికే తెలంగాణలో హుజురాబాద్ ఉప ఎన్నిక చాలా కాస్ట్‌లీ అంటూ ప్రచారం జరుగుతోంది. ఈ ఎన్నికలో గెలుపు ఇరుపార్టీలకు చాలా అవసరం. ప్రజల్లో తమపై వ్యతిరేకత…
పంజాబ్‌లో కొత్త పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్టు ఇప్పటికే కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కొన్ని అనూహ్యమైన కారణాల వలన అమరీందర్ సింగ్ పంజాబ్ ముఖ్యమంత్రి పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాల్సి వచ్చింది. రాజీనామా చేసిన తరువాత ఆయన ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలతో భేటీ అయ్యారు. బీజేపీలో చేరి పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీ చేయాలని అనుకున్నారు. అయితే, గత కొంతకాలంగా రైతు చట్టాలకు వ్యతిరేకంగా సిక్కు రైతులు పోరాటం చేస్తున్నారు. పంజాబ్…
ఓటు అనేది ప్రజాస్వామ్యానికి వజ్రాయుధం లాంటింది. ఓటర్లు దీనిని ఎలా వాడుకుంటే అదే రిజల్ట్ వస్తుంది. ఎన్నికల్లో మంచి నాయకుడిని ఎన్నుకుంటే భవిష్యత్ బంగారుమయంగా ఉంటుంది. అలాకాకుండా ఓటును నోటుకో, మద్యానికో అమ్ముకుంటే కష్టాలుపడక తప్పదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గత కొన్నేళ్లుగా రాజకీయాలు భ్రష్టుపట్టిపోవడంతో శాసనసభ, పార్లమెంట్ ఉభయ సభల్లోకి క్రిమినల్ రికార్డులున్న వాళ్లే ఎక్కువగా అడుగు పెడుతున్నారు. ఇది రానున్న రోజుల్లో ప్రజాస్వామ్యానికి పెనుముప్పును తెచ్చే పెట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం నూటికి…
దేశంలో బీజేపీని ఓడించేందుకు కంకణం కట్టుకున్న దీదీ కాళ్లకు చక్రాలు కట్టుకొని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పర్యటించి ఆ పార్టీని ఓడించేందుకు ప్రతిపక్షాలను ఏకం చేస్తున్నారు. బీజేపీ పాలన నుంచి దేశాన్ని కాపాడాలి అనే లక్ష్యంగానే దీదీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. బెంగాల్‌లో ఇచ్చిన విజయాన్ని స్పూర్తిగా తీసుకొని గోవాలో పార్టీ పోటీ చేయడానికి సిద్ధమయింది. త్వరలోనే గోవా అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. 40 స్థానాలున్నా గోవా అసెంబ్లీలో ఎలాగైనా పాగా వేయాలని తృణమూల్ కాంగ్రెస్ చూస్తున్నది. ఈనెల…
వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్‌కు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించి పార్టీకి పునర్వైభవం తీసుకురావాలి చూస్తున్నది కాంగ్రెస్ పార్టీ. రాష్ట్రంలో మహిళల ఓట్లు ఎవరికైతే పడతాయో వారు విజయం సాధించే అవకాశం ఉంటుంది. దీంతో కాంగ్రెస్ పార్టీ మహిళా ఓటర్లను ఆకట్టుకునే దిశగా అడుగులు వేస్తున్నది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 40 శాతం సీట్లను మహిళలకు కేటాయిస్తామని ఇప్పటికే ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అదనంగా మరికోన్ని వరాలను ప్రకటించింది. వచ్చే ఎన్నికల్లో…
ఎక్కడ ఏ ఎన్నిక జరిగినా అందులో కులమే కీలకం. అభ్యర్థి ఎంపిక మొదలు గెలుపు వరకు కులందే ప్రధాన భూమిక. నిజం చెప్పాలంటే ఇప్పుడు నడుస్తున్నది కుల రాజకీయం. కులాల మీద మీద ఆధారపడి రాజకీయం చేస్తున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కూడా కుల రాజకీయం ఓ రేంజ్లో నడుస్తోంది. కులం ఓట్లను పక్కా చేసుకునే పనిలో పడ్డాయి ప్రధాన పార్టీలు. కులం ఓట్ల కోసం నేతలు పడరాని పాట్లు పడుతున్నారు. పెద్ద పెద్ద ప్లాన్లు వేస్తున్నారు.…
పంజాబ్ లో కొత్త పార్టీ అవతరించబోతున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ కొత్త పార్టీ పెట్టబోతున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది నేతలు, ఎమ్మెల్యేలు తనకు మద్దతుగా ఉన్నారని, పార్టీని స్థాపించిన తరువాత వారంతా తమతో కలిసి వస్తారని అమరీందర్ సింగ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే, కేంద్రం తీసుకొచ్చిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్ రైతులు పెద్ద…
వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్‌కు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించి కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తీసుకురావాలని పార్టీ ప్రయత్నిస్తున్నది. అవకాశం ఉన్న ఏ అంశాన్ని కూడా వదుకుకోవడంలేదు. ఉత్తర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలను ప్రియాంక గాంధీ తన భుజాన వేసుకొని ప్రచారం చేస్తున్నారు. రైతుల నిరసలకు మద్ధతు తెలపడమే కాకుండా వారితో కలిసి పోరాటం చేశారు. లఖింపూర్ ఘటనపై కాంగ్రెస్ పార్టీ స్పందించిన తీరు, పోరాటం చేసిన విధానం ఆ పార్టీకి కొంతమేర…