వచ్చే ఏడాది గుజరాత్‌కు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలపై అధికార బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దృష్టి సాయించాయి. ఇప్పటి నుంచే కసరత్తులు చేస్తున్నాయి. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని గుజరాత్ ముఖ్యమంత్రిని కూడా మార్చేసింది బీజేపీ అధిష్టానం. అటు కాంగ్రెస్ కూడా ధీటుగా ప్రణాళికలు రచిస్తున్నది. ఆప్ సైతం తన ప్రభావాన్ని చూపేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. కాగా, ఇప్పుడు మరోపార్టీ కూడా గుజరాత్ ఎన్నికలపై కన్నేసింది. అదే ఎంఐఎం. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌లో బలమైన పార్టీగా నిలిచిన ఎంఐఎం బీహార్ ఎన్నికల్లో పోటీ చేసి ఉనికిని చాటుకుంది. యూపీలో పోటీ చేసేందుకు ఇప్పటికే సిద్ధం అయింది. మాహారాష్ట్ర ఎన్నికల్లోనూ పోటీ చేసింది. కాగా, ఇప్పుడు గుజరాత్‌లో పోటీ చేసేందుకు సిద్ధం అవుతున్నది. త్వరలోనే ఆ పార్టీ గుజరాత్ కేడర్‌లో కేడర్ ను ఏర్పాటు చేసి పోటీకి రంగం సిద్దం చేయనున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ గుజరాత్‌లో పర్యటిస్తున్నారు.
Read: ఐరాస ఆందోళన: ఆ సమస్య పరిష్కారం కాకుంటే… ప్రపంచం రెండు ముక్కలు…