రాజస్థాన్ లోని ఆరు జిల్లాల్లో మూడు దశల్లో 1564 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మెజారిటీ పంచాయితీను దక్కించుకుంది. కాంగ్రెస్ పార్టీ 598 పంచాయతీల్లో విజయం సాధించగా, ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ 490 పంచాయతీల్లో విజయం సాధించింది. ఆర్ఎల్‌పీ 39, బీఎస్పీ 10, ఎస్సీపీ రెండు స్థానాల్లో గెలుపొందాయి. ఇక ఇండిపెండెంట్లు 250 చోట్ల విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ రాజస్థాన్‌లో గ్రామస్థాయి నుంచి పట్టు ఉందని మరోసారి నిరూపించుకుంది.…
ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘం దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న అసెంబ్లీ సీట్లుకు సంబందించి ఎన్నికన షెడ్యూల్‌ను రిలీజ్ చేసింది. వెస్ట్ బెంగాల్‌లో మూడు అసెంబ్లీ స్థానలకు, ఒడిశాలో ఒక అసెంబ్లీ నియోజక వర్గానికి ఎన్నికలు జరగబోతున్నాయి. వెస్ట్ బెంగాల్‌లో ఎన్నికల షెడ్యూల్ వెలువడిన వెంటనే హడావుడి మొదలైంది. నందిగ్రామ్ నుంచి పోటీ చేసి ఓటమిపాలైన మమతా బెనర్జీ తన పాత నియోజక వర్గమైన భాబినీపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ నియోజక వర్గం…
పేరుకు అభివృద్ధి అని చెబుతున్నా.. అధికారపార్టీని ఇరుకున పెట్టేలా వైరిపక్షాలు అడుగులు వేస్తున్నాయా? భద్రాచలంలో.. ఆ ఐదు గ్రామాల అంశాన్ని మళ్లీ రోడ్డెక్కించడం వెనక వ్యూహం అదేనా? ఢిల్లీ స్థాయిలో కదలిక తేవాల్సిన చోట.. లోకల్ పాలిటిక్స్ వేడి పుట్టిస్తాయా? ఇంతకీ ఆ ఐదు గ్రామాల రగడేంటి? ఐదు గ్రామాల విలీనంపై ఇరుకున పెట్టే రాజకీయాలు! భద్రాచలానికి ఆనుకుని ఉన్న ఐదు గ్రామాలు పిచ్చుకలపాడు, పురుషోత్తమ పట్నం, ఎటపాక, గుండాల, కన్నాయిగూడెంలను తిరిగి తెలంగాణలో కలపాలన్న డిమాండ్…
ప్రస్తుతం ఎన్నికలు అంటేనే డబ్బు, మద్యం.. ఆపై సామాజికంగా విభజించి ఓట్లను కొనేయడమే అన్న చందంగా మారాయి. ఎన్నికల కమీషన్ ఎంత చైతన్య పరుస్తున్న మార్పు కనిపించడం లేదు. కఠినమైన చట్టాలు వున్నా శిక్ష పడట్లేదు అనేది సగటు ఓటరు ఆవేదన.. అయితే తాజాగా ఓ ఎన్నికల్లో డబ్బులు పంచిన మాజీ ఎమ్మెల్యేకు జైలు శిక్ష ఖరారు చేసింది కోర్టు..వివరాల్లోకి వెళ్తే, పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు కోర్టు జైలు శిక్ష విధించింది. ఎన్నికల్లో డబ్బులు…
ప్రతి ఏడాది దేశంలో ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. ఇలా రాష్ట్రాల ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికలు వేరువేరుగా నిర్వహించడం వలన అధికవ్యయం అవుతున్నది. అంతేకాకుండా అభివృద్ది సైతం కొంత వెనకబడే అవకాశం ఉంటుంది. దేశంలోని అన్ని రాష్ట్రాలకు, లోక్‌సభకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వలన ఒకేసారి ఖర్చు చేస్తే సరిపోతుంది. దేశంలో జరిగే సార్వత్రిక ఎన్నికలకు కేంద్రం నిధులు కేటాయిస్తే, రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలకు ఆయా రాష్ట్రాలు నిధులు సమకూర్చుకోవాలి. అదే అన్ని ఎన్నికలు…
ఇప్పటికే ఢిల్లీలో విజయవంతమైన ఉచిత విద్యుత్ హీమీని ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు చేసి లబ్ది పొందాలని చూస్తున్నది ఆప్. ఇందులో భాగంగా ఆప్ ఇప్పటికే పంజాబ్ రాష్ట్రంలో ఈ హామీని ఇచ్చింది. త్వరలోనే ఈ రాష్ట్రానికి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో ఆప్ విజయం సాధిస్తే తప్పకుండా ఉచిత విద్యుత్‌ను అమలు చేస్తామని ఆప్ పేర్కొన్నది. ఆప్ హమీపై పంజాబ్ యువతి వెరైటీగా స్పందించింది. తనకు ఉచిత విద్యుత్ అవసరం లేదని ఆప్ ఎమ్మెల్యే రాఘవ్…
బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఢిల్లీలో బిజీ బిజీగా ఉన్నారు. నిన్నటి రోజున ప్రధాని మోడిని కలిసిన తరువాత, కొంతమంది కేంద్ర మంత్రులను కూడా కలిశారు. కాగా ఈ రోజు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కలిశారు. ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితులు, పెగాసస్ వ్యవహారం, వ్యాక్సినేషన్‌పై సోనియా గాంధీతో చర్చించారు. అదేవిధంగా విపక్షాలను ఏకం చేసి 2024 ఎన్నికల్లో మోడీకి వ్యతిరేకంగా పోరాటం చేయాలనే లక్ష్యంతో ఆమె పావులు కదుపుతున్నారు. ఇప్పటికే ఈ విషయంపై సోనియాతో…
దేశ రాజకీయాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. పశ్చిమ బెంగాల్‌లో ఎలాగైనా అధికారంలోకి రావాలని చూసిన బీజేపీని ఢీకొట్టి ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ ఇప్పుడు జాతీయ రాజకీయాలపై దృష్టిసారించారు. మోడీని ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు పావులు కదుపుతున్నారు. అన్ని రాష్ట్రాల్లోను బీజేపీని ఒడించేందుకు కొన్ని పార్టీలు కలిపి పోటీ చేస్తుండేవి. కానీ, పశ్చిమ బెంగాల్‌లో మమత ఒక్కరే తలపడ్డారు. గతంలో వచ్చిన స్థానాల కంటే ఎక్కువ స్థానాల్లో ఆ…
ఏలూరు కార్పోరేషన్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఈరోజు ఉదయం నుంచి కార్పోరేషన్‌కు సంబందించి కౌంటింగ్ ప్రారంభం అయింది. మొత్తం 47 డివిజన్లకు గాను మూడు డివిజన్లు ఏకగ్రీవం అయ్యాయి. ఏకగ్రీవమైన మూడు డివిజన్లు వైసీపీ ఖాతాలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు 20 డివిజన్ల ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో 18 చోట్ల వైసీపీ విజయం సాధించగా, రెండు చోట్ల టీడీపి విజయం సాధించింది. ఏలూరు కార్పోరేషన్ ఎన్నికల్లో 40కి పైగా డివిజన్లు కైవసం చేసుకుంటామని వైసీపీ…
ఇటీవలే పెరూ దేశంలో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఓ సామాన్యుడు సత్తాచాటారు. పెరూ దేశంలో ఓ మారుమూల గ్రామంలో సాధారణ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తించిన వ్యక్తి ఆధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్నారు. ఒక సామాన్యమైన వ్యక్తి అధ్యక్షపీఠాన్ని కైవసం చేసుకోవడంతో ప్రపంచం దృష్టి మొత్తం పెరూ వైపు చూసింది. గత నెల 6 వ తేదీన పెరూ దేశంలో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలు హోరాహోరిగా జరిగాయి. ఈ ఎన్నికల్లో 51 ఏళ్ల పెడ్రో కాస్టిలో…