తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి ఏర్పడింది. తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో 12 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి వుంది. మొత్తం 102 నామినేషన్లు దాఖలయ్యాయి. చెదురుమదురు ఘటనలు మినహా నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఇక పరిశీలన, ఉపసంహరణ మిగిలింది. స్వతంత్ర అభ్యర్థి నామినేషన్లను టీఆర్‌ఎస్ మద్దతుదారులు చించివేయడంతో రంగారెడ్డి కలెక్టరేట్ వద్ద ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. నామినేషన్ల గడువు మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు ముగిసింది. అధికార టీఆర్‌ఎస్ పార్టీ అన్ని స్థానాల్లో పోటీ…
ఏపీలో నేడు రాష్ట్ర వ్యాప్తంగా కార్పోరేషన్, మున్సిపాల్టీలు, నగర పంచాయతీల్లో ఛైర్ పర్సన్ ఎన్నికలు జరగనున్నాయి. నెల్లూరు కార్పోరేషన్ సహా 12 మున్సిపల్, నగర పంచాయతీల్లో ఛైర్ పర్సన్ ఎన్నికలు జరగనుండగా… మూడు మండలాల్లో ఎంపీపీ, 6 మండలాల్లో మండల ఉపాధ్సక్ష పదవులకు ఎన్నిక చేపట్టనున్నారు అధికారులు. ఇక విజయనగరం జెడ్పీ ఉపాధ్యక్ష పదవికి నేడే ఎన్నిక జరగనుంది. మొత్తం 130 పంచాయతీల్లో ఉప సర్పంచ్ ఎన్నిక ప్రక్రియ చేపట్టనున్నారు అధికారులు. అయితే ఈ ఎన్నికలో కొండపల్లి…
ఏపీలో 10 జెడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ ప్రారంభం అయింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనున్నది. మొత్తం 8 లక్షల మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోబోతున్నారు. కాగా, గతంలో వివిధ కారణాలతో ఎన్నికలు నిలిచిపోయిన స్థానాల్లో ఇప్పుడు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికల పోలింగ్ కోసం 954 కేంద్రాలను ఏర్పాటు చేశారు. Read: యూపీ పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ల్యాండింగ్ కానున్న ప్రధాని విమానం… 10…
ఏపీలో ఇవాళ 69 పంచాయతీల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసినా.. కేసుల కారణంగా కొన్ని చోట్ల.. అభ్యర్థుల మరణంతో మరికొన్ని చోట్ల.. గొడవలు జరిగి ఇంకొన్ని చోట్ల… ఎన్నికలు నిలిచిపోయాయి. వీటిన్నింటికీ ఒకేసారి ఎన్నికలు జరగబోతున్నాయి. ఇవాళ 69 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించి… పోలింగ్ ముగిశాక ఓట్లు లెక్కపెట్టి విజేతను ప్రకటిస్తారు. ఇక రేపు నెల్లూరు కార్పొరేషన్‌తో పాటు 12 మున్సిపాల్టీలకు ఎన్నికలు జరుగుతాయి. ఇందులో ఆకీవీడు, జగ్గయ్యపేట, కొండపల్లి, దాచేపల్లి, గురజాల,…
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థలకు జరుగుతోన్న ఉప ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులను గెలిపించాలంటూ విజ్ఞప్తి చేశారు జనసేనాని పవన్ కల్యాణ్.. స్థానిక ఎన్నికల్లో జనసేన అభ్యర్థులను ఆశీర్వదించండి.. ఒక మార్పు కోసం ఈ పోరాటం జరుగుతోంది.. జన సైనికులు పదవుల కోసం కాకుండా సేవచేయడానికే ముందుంటారు.. ప్రజల కోసం పని చేసే వారికే అభ్యర్థులుగా నిలబెట్టాం అని… ప్రజా సమస్యల పరిష్కారం కోసం పాటుపడేవారినే ఈ ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేస్తున్నారు.. పార్టీ భావజాలాన్ని అర్థం…
బల్దియా స్టాండింగ్ కమిటీ ఎన్నికలంటే ఎప్పుడూ ఉత్కంఠే. తాజాగా బల్దియా స్టాండింగ్ కమిటీ ఎన్నికల నామినేషన్లు రసవత్తరంగా మారాయి. మరికొద్ది గంటల్లో ముగియనున్న నామినేషన్ల గడువు ముగియనుంది. చివరిరోజు కావడంతో ఇవాళ 7 నామినేషన్లు వేశారు ఎంఐఎం కార్పొరేటర్లు. ఇప్పటివరకు టిఆర్ఎస్ నుంచి ఆరు నామినేషన్లు దాఖలయ్యాయి. అవి కూడా పార్టీ నిర్ణయం మేరకు కాకుండా సొంతంగా వేసినట్లు సమాచారం అందుతోంది. పార్టీ నిర్ణయానుసారం ఇవాళ టీఆర్ఎస్ నుంచి 9 నామినేషన్లు వేయనున్నారు కార్పొరేటర్లు. 15 నామినేషన్లకు…
ప్రాంతీయ పార్టీల ఏకైక సిద్ధాంతం అవకాశవాదం మాత్రమే అన్నారు మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. 2023 లో తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. టీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతం దాచుకోవడం.. దోచుకోవడం. మహాత్మా గాంధీని చంపింది బీజేపీ, ఆర్ఎస్ఎస్ లే. నెహ్రూను తక్కువచేసి చూపించేందుకు బీజేపీ సావర్కర్ ను తెరపైకి తీసుకు వస్తుందన్నారు ఉత్తమ్. ఒక్క సంతకంతో దేశం మొత్తం రైతు రుణమాఫీ చేసిన చరిత్ర…
తెలంగాణలో ఒక్క అక్టోబర్ నెలలో రికార్డ్ స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయి. అక్టోబర్ నెలలో ఏకంగా రూ.2,653.07 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్టు ఎక్సైజ్ శాఖ తెలియజేసింది. 2020 అక్టోబర్ నెలతో పోలిస్తే సుమారు రూ.30 కోట్లు అధికంగా మద్యం అమ్మకాలు జరగ్గా, 2019 అక్టోబర్ తో పోలిస్తే ఏకంగా వెయ్యికోట్లు అమ్మకాలు పెరిగాయి. సాధారణంగా పండుగలు, సెలవులు అధికంగా ఉన్న సమయాల్లో మద్యం అమ్మకాలు భారీగా పెరుగుతుంటాయి. Read: దీపావళి ని మన దేశంలో…
త్వరలోనే గోవా అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో కొత్తగా తృణమూల్ కాంగ్రెస్, ఆప్ పార్టీలు పోటీ చేయబోతున్నాయి. ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని ప్రారంభించింది. కాగా, ఆప్ పార్టీ మరో అడుగుముందుకు వేసి ప్రచారం చేసే కంటే ముందే హామీల వర్షం కురిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఆప్ విజయం సాధిస్తే గోవాలోని ప్రజలను వారి మతాలను అనుసరించి తీర్థయాత్రలకు తీసుకెళ్తామని ప్రకటించింది. దీనిపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఎన్నికల్లో గెలపుకోసం ఇలాంటి హామీలు…