యూపీ సీఎం యోగికి ఎంత ఆస్తి వుందో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూపీ ఎన్నికల సందర్భంగా ఆయా పార్టీల అభ్యర్ధులు నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తున్నారు. నేతల ఆస్తిపాస్తులు, అప్పుల వివరాలు బయటపడుతున్నాయి. యూపీ సీఎం యోగి తన నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. గోరఖ్‌పుర్ శాసనసభస్థానం నుంచి యోగి తన నామినేషన్ దాఖలుచేశారు.
ఇప్పటివరకు లోక్‌సభకు ఐదుసార్లు ఎన్నికైన ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ తొలిసారి అసెంబ్లీ స్థానం నుంచి పోటీకి సిద్ధమయ్యారు. నామినేషన్ పత్రాలలో తన ఆస్తులు, తనపై ఉన్న కేసులకు సంబంధించిన వివరాలను అఫిడవిట్‌లో వెల్లడించారు. ఆయనకు కోటి 54 లక్షల 94 వేల 54 రూపాయల విలువైన ఆస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. వీటిలో కొంత నగదుతోపాటు వివిధ బ్యాంకు ఖాతాల్లో మరికొంత డబ్బు ఉన్నట్లు తెలిపారు. వీటితోపాటు 12వేల రూపాయల విలువ కలిగిన ఓ శాంసంగ్ మొబైల్ ఫోన్, లక్ష రూపాయల విలువగల రివాల్వర్, రూ.80 వేల విలువ కలిగిన మరో రైఫిల్ ఉందన్నారు.
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
49 వేల విలువగల బంగారు చెవి రింగు, రూ.20వేల విలువ కలిగిన రుద్రాక్షహారం తన వద్ద ఉన్నట్లు యూపీ సీఎం పేర్కొన్నారు. తన పేరు మీద ఎటువంటి వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తులు లేవని ఎన్నికల అఫిడవిట్‌లో తెలిపారు. సొంత వాహనం కూడా లేదని పేర్కొన్నారు. బ్యాంకుల్లో ఎటువంటి రుణాలూ లేవని వెల్లడించారు. పెండింగ్‌లోనూ ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని ఎన్నికల అఫిడవిట్‌లో యోగీ ఆదిత్యనాథ్ వెల్లడించారు. నాలుగేళ్లలో తన ఆదాయ వివరాలను కూడా అఫిడవిట్‌లో యోగి వివరించారు. యోగి అఫిడవిట్ ఇప్పుడు యూపీలో హాట్ టాపిక్ అవుతోంది.
తాజావార్తలు
-
LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
-
Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం”: జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
-
Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!