కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సరికొత్త రికార్డ్ సృష్టించబోతున్నారు. ఓ మహిళా కేంద్రమంత్రిగా ఆమె ఒక మైలురాయిని సాధించబోతున్నారు. గురువారం (ఫిబ్రవరి 1, 2024) పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌తో దేశ చరిత్రలోనే ఆమె ఒక హిస్టరీ క్రియేట్ చేయబోతున్నారు.
గురువారం మోడీ ప్రభుత్వం పార్లమెంట్‌లో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ చదవనున్నారు. మోడీ సర్కార్‌కు కూడా ఇవే చివరి బడ్జెట్ సమావేశాలు. ఈ సందర్భంగా ప్రధాని మీడియాతో మాట్లాడారు.
గురువారం కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో బడ్జెట్ చదవనున్నారు. ఈ బడ్జెట్‌పై దేశ వ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Pakistan : పొరుగు దేశం పాకిస్థాన్‌లో ద్రవ్యోల్బణం కారణంగా సామాన్య ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే డజను కోడి గుడ్లు రూ.400కి పలుకుతోంది. ప్రస్తుతం కిలో ఉల్లికి రూ.250 చెల్లించాల్సిన పరిస్థితి అక్కడి ప్రజలు నెలకొంది.
Bangladesh Election Today: బంగ్లాదేశ్ జాతీయ అసెంబ్లీ పన్నెండవ ఎన్నికలకు ఆదివారం (07 జనవరి) ఓటింగ్ ప్రారంభమైంది. ప్రధానమంత్రి షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్‌తో సహా మొత్తం 27 పార్టీలు ఈ ఎన్నికల్లో పాల్గొన్నాయి,
తెలంగాణ అసెంబ్లీలో స్పీకర్ ఎన్నికకు ఇవాళ నామినేషన్లు స్వీకరించారు. నామినేషన్లకు సంబంధించి గడువు కొద్దిసేపటి క్రితమే ముగిసింది. అందులో ఒకే ఒక నామినేషన్ దాఖలు అయింది. ఈ క్రమంలో అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. కాగా.. రేపు అసెంబ్లీలో స్పీకర్ ఎన్నికను అధికారికంగా ప్రొటెం స్పీకర్ ప్రకటించనున్నారు.
తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలు స్పందిస్తూ.. తమ ఓటమికి గల కారణాలను తెలుసుకుంటామన్నారు. ఈ ఎన్నికల ఫలితాలను ఒక పాఠంగా తీసుకుంటామని, తిరిగి మళ్లీ పుంజుకుంటాం బీఆర్ఎస్ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో మాజీమంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన ఆయన.. బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి నివాళులు అర్పించారు.
తెలంగాణలో ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈ క్రమంలో.. డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు వెలవడనున్నాయి. అందుకు సంబంధించి పలువురు రాజకీయ పార్టీల నేతలు గెలుపు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ కార్యకర్తలపై భౌతిక దాడులకు పాల్పడిందని ఆరోపించారు