Rajasthan Voter List: రాజస్థాన్‌లో ఈ ఏడాది నవంబర్-డిసెంబర్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు ముమ్మరం చేసింది. ఎన్నికల కోసం కమిషన్ అన్ని రాజకీయ పార్టీలు, పరిపాలన అధికారులు, ఇతర వ్యక్తులతో సమావేశాలు నిర్వహించింది.
Rajasthan Assembly Election: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల రెండో రోజు మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. పార్లమెంట్, అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే నారీ శక్తి వందన్ చట్టం లోక్‌సభ, రాజ్యసభల్లో ఆమోదం పొందితే.. పలు రాష్ట్రాల అసెంబ్లీల చిత్రణ పూర్తిగా మారిపోతుంది.
చంద్రబాబు కాన్వాయ్ లోని రౌడీ మూకలు కర్రలు, రాళ్లు తెచ్చారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కామెంట్స్ చేశారు. విచక్షణా రహితంగా పోలీసులపై దాడులు చేశారు.. చంద్రబాబు తీరు మొగుడ్ని కొట్టి మొగసాలికేక్కినట్టు ఉంది.. పోలీసులపై దాడులు చేసి.. రివర్స్ లో మాట్లాడుతున్నారు.
పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా నుండి ఉత్తరప్రదేశ్‌లోని లక్నో, తమిళనాడులోని చెన్నై, ఢిల్లీ, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్షాల సమావేశాలు నిర్వహించడానికి ప్రణాళికలు రూపొందించారు.
ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ప్రధాన మంత్రిగా.. ముఖ్యమంత్రిగా 10 ఏళ్లు కంటిన్యూగా ఒక్కరే కొనసాగడం కష్టం. కానీ ఆ దేశానికి అతను ఏకంగా 40 ఏళ్లుగా ప్రధానమంత్రిగా కొనసాగుతున్నారు.
2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ అధిష్టానం చర్యలు ప్రారంభించింది. కర్నాటక శాసనసభ ఎన్నికల్లో పార్టీ విజయం సాధించిన తరువాత.. వివిధ రాష్ట్రాల్లో ఉన్న పార్టీ పరిస్థితిని సమీక్షించి పార్టీ పటిష్టతకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.
ఎన్నికలొస్తుంటే డిక్లరేషన్ పేరుతో ఓట్లు దండుకుని మోసం చేసే పార్టీ బీజేపీ కాదు అని బండి సంజయ్ అన్నారు. బీసీ సబ్ ప్లాన్, డిక్లరేషన్ రూపకల్పన కోసం క్షేత్రస్థాయిలోకి వెళ్లి సలహాలు స్వీకరిస్తామన్నారు.
హుజూర్ నగర్ పట్టణ కేంద్రంలో నియోజికవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ శాసనసభా ఎన్నికల సన్నాహక సమావేశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ఈసారి ఎన్నికల్లో 50వేల ఓట్లకు ఒక్క ఓటు తక్కువచ్చినా నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా అని తెలిపారు.
CM YS Jagan: ఎన్నికల్లో పొత్తుల విషయంలో విపక్షాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. వైఎస్‌ఆర్ మత్స్యకార భరోసా నిధుల విడుదల సందర్భంగా బాపట్ల జిల్లా నిజాంపట్నంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలోనే చంద్రబాబుకు పేదలు గుర్తుకు వస్తున్నారు.. గత పాలనలో ఎస్సీలకు, మత్స్యకారులకు, బీసీలకు అన్యాయం జరిగింది అని ఆరోపించారు.. నేను చేసిన మంచిని ప్రజలని, దేవుడిని నమ్ముకున్నాను.. కానీ, చంద్రబాబు, దత్త పుత్రుడు పొత్తులు, ఎత్తులు,…
బళ్లారి సిటీ కార్పొరేషన్కు మేయర్గా కాంగ్రెస్కు చెందిన 23 ఏళ్ల త్రివేణి ఎన్నికయ్యారు. కర్ణాటకలో అతి పిన్న వయసులో మేయర్గా రికార్డు సృష్టించారు. డిప్యూటీ మేయర్గా కాంగ్రెస్కు చెందిన బి. జానకి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.