రేపు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరగనుంది. గత ఎన్నికల్లో యూటీఎఫ్ తరఫున గెలిచిన షేక్ సాబ్జీ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఈ ఉపఎన్నిక అనివార్యమైంది. ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు.
Lok Sabha Election 2024 : లోక్‌సభ ఎన్నికల తేదీలను నేడు అంటే శనివారం ప్రకటించనున్నారు. దీంతో పాటు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను కూడా ప్రకటించనున్నారు.
ఉత్తరాఖండ్ ఎన్నికల్లో బీజేపీ విజయం వైపు దూసుకెళ్తున్నా ఆ పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. సీఎం పుష్కర్ సింగ్ ధామి ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఖతిమా నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పుష్కర్ సింగ్ ధామి కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఘోర పరాజయం పాలయ్యారు. సీఎం పుష్కర్ సింగ్‌పై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ భువన్ చంద్ కప్రీ 6,951 ఓట్ల తేడాతో విజయం సాధించారు. కాగా ఖతిమా నియోజకవర్గంలో మొత్తం 91,325 ఓట్లు పోలవగా పుష్కర్ సింగ్…
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో బీజేపీ తిరిగి విజయ పీఠాన్ని దక్కించుకుంది. అయితే బీజేపీ సాధించిన విజయంలో ఓ తెలుగు వ్యక్తి కృషి కూడా దాగి ఉంది. అతడే సత్యకుమార్. బీజేపీలో అంచెలంచెలుగా ఎదిగి జాతీయ స్థాయి నేతగా మారి ప్రస్తుతం యూపీ బీజేపీ ఇంఛార్జిగా ఆయన సేవలందిస్తున్నారు. అభ్యర్థుల ఎంపిక నుంచి తనదైన ప్రచార వ్యూహ రచనతో యూపీలోని 403 స్థానాల్లో 135 స్థానాలకు సత్యకుమార్ చేసిన కృషి అనితర సాధ్యమని రాజకీయ విశ్లేషకులు…
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యం కనపరుస్తోంది. అయితే పంజాబ్‌లో ఆప్ ప్రభుత్వం రావడం ఖరారు కాగా గోవాలో హంగ్ ఏర్పడుతుందని ప్రస్తుత ఫలితాల సరళి చాటి చెప్తోంది. 40 అసెంబ్లీ స్థానాలున్న గోవాలో బీజేపీ 19 స్థానాల్లో లీడింగ్ లో ఉంది. గోవాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 21 మంది ఎమ్మెల్యేల అవసరం ఉంటుంది. బీజేపీకి స్పష్టమైన ఆధిక్యం రాకపోవడంతో గోవా ప్రభుత్వ ఏర్పాటులో టీఎంసీ, ఇండిపెండెంట్లు కీలకం కానున్నారు.…
తెలంగాణలో స్థానిక సంస్థల కోటాలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు శుక్రవారం నాడు ఎన్నికలు జరగనున్నాయి. వాస్తవానికి స్థానిక సంస్థల కోటాలో 12 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ వచ్చింది. వీటిలో ఇప్పటికే ఆరు ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగతా ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు రేపు పోలింగ్ జరుగనుంది. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండు స్థానాలకు 10 మంది అభ్యర్థులు, ఉమ్మడి నల్గొండ జిల్లాలో…
దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల్లో 30 శాసనసభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో అధికార పార్టీ బీజేపీకి ఎదురుగాలి వీచింది. బీజేపీ కేవలం 7 స్థానాల్లో మాత్రమే గెలవగా… ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ మాత్రం 8 స్థానాల్లో విజయం సాధించింది. మిగతా 15 స్థానాలను ప్రాంతీయ పార్టీలు గెలుచుకున్నాయి. దేశంలో మూడు లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరిగితే కేవలం మధ్యప్రదేశ్ ఖండ్వా స్థానంలోనే బీజేపీ విజయం సాధించింది. దాద్రానగర్ హవేలీలో శివసేన, హిమాచల్ ప్రదేశ్ మండీలో కాంగ్రెస్ విజయం…
హుజురాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. ఇప్పటివరకు 14 రౌండ్ల ఫలితాలు పూర్తిగా కేవలం రెండు రౌండ్లలో మాత్రమే టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధిక్యం చూపించారు. మిగతా 12 రౌండ్లలో ఈటల రాజేందర్ స్పష్టమైన ఆధిక్యం కనపరిచారు. 14 రౌండ్ల ఫలితాలు ముగిసే సరికి ఈటల రాజేందర్ 9,434 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. Read Also: హుజురాబాద్ ఈటల కంచుకోట..? అయితే టీఆర్ఎస్ నేతల గ్రామాల్లోనూ బీజేపీ అభ్యర్థి…
బద్వేలులో ఉప ఎన్నిక సమరం ముగిసింది. ఈనెల 2న ఫలితం తేలనుంది. అయితే ఉప ఎన్నికలో గెలుపు వైసీపీకే అనుకూలంగా ఉండబోతుందని స్పష్టంగా తెలుస్తున్నా.. బరిలో నిలిచిన బీజేపీకి ఎన్ని ఓట్లు వస్తాయన్నది కీలకంగా మారింది. ఎందుకంటే బద్వేల్ ఉప ఎన్నికలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ పోటీ చేయలేదు. అయితే తెరచాటున బీజేపీకి టీడీపీ సాయం చేసిందని జరిగిన పరిణామాలను చూస్తే అర్థమవుతోంది. బద్వేల్ నియోజకవర్గంలో 281 పోలింగ్ కేంద్రాలు ఉండగా.. పలు చోట్ల…
ఏపీలోని బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉపఎన్నిక కొనసాగుతోంది. పోలింగ్ సందర్భంగా దొంగ ఓట్ల కలకలం రేగింది. అట్లూరులో 10 మంది మహిళలు దొంగ ఓట్లు వేయడానికి వచ్చారు. వారి వద్ద ఓటర్ స్లిప్పులు తప్ప ఆధార్ కార్డులు లేవని ఎన్నికల అధికారులు గుర్తించారు. దీంతో పోలీసులు వారిని ఓటు వేయనీయకుండా వెనక్కి పంపించారు. కాగా మిగతా చోట్ల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందని పోలీసులు తెలిపారు. Read Also: బీజేపీ పోలింగ్ ఏజెంట్లుగా టీడీపీ నేతలు మరోవైపు బద్వేల్…