బద్వేలులో బీజేపీకి టీడీపీ సాయం.. బీజేపీ సాధించే ఓట్లెన్ని?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బద్వేలులో ఉప ఎన్నిక సమరం ముగిసింది. ఈనెల 2న ఫలితం తేలనుంది. అయితే ఉప ఎన్నికలో గెలుపు వైసీపీకే అనుకూలంగా ఉండబోతుందని స్పష్టంగా తెలుస్తున్నా.. బరిలో నిలిచిన బీజేపీకి ఎన్ని ఓట్లు వస్తాయన్నది కీలకంగా మారింది. ఎందుకంటే బద్వేల్ ఉప ఎన్నికలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ పోటీ చేయలేదు.
అయితే తెరచాటున బీజేపీకి టీడీపీ సాయం చేసిందని జరిగిన పరిణామాలను చూస్తే అర్థమవుతోంది. బద్వేల్ నియోజకవర్గంలో 281 పోలింగ్ కేంద్రాలు ఉండగా.. పలు చోట్ల బీజేపీ ఏజెంట్లుగా టీడీపీ నేతలు కూర్చున్నారు. దీంతో టీడీపీ నేతలు తమకు ఉన్న ఓటు బ్యాంకును బీజేపీకి షిఫ్ట్ చేయించారని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
బద్వేల్ ఉప ఎన్నికలో 69 శాతం పోలింగ్ నమోదు కాగా ఇందులో బీజేపీ ఓటు శాతం ఎంతో కౌంటింగ్ రోజు బహిర్గతం కానుంది. అయితే 2019 ఎన్నికల్లో 77 శాతం పోలింగ్ నమోదు కాగా వైసీపీకి గుంపగుత్తగా ఓట్లు పడ్డాయి. మొత్తం పోలైన ఓట్లలో వైసీపీకి 60 శాతం ఓట్లు పడగా టీడీపీకి 32 శాతం ఓట్లు పడ్డాయి. అప్పుడు టీడీపీకి పడ్డ ఓట్లు ఉప ఎన్నికలో ఏ పార్టీకి పడతాయన్న అంశం ఆసక్తికరంగా మారింది.
ఒకవేళ టీడీపీ మద్దతుదారులు ఓటింగ్‌కు దూరంగా ఉంటే 69 శాతం పోలింగ్ నమోదు కాదు. పైగా 2019లో బీజేపీకి పడిన ఓట్లు 735. మరి ఇప్పుడు నమోదైన 69 శాతం పోలింగ్‌లో టీడీపీ సహకారం లేకపోతే బీజేపీకి ఎక్కువ ఓట్లు పడే అవకాశమే లేదు. కాబట్టి పోలింగ్ ఏజెంట్లే లేని బీజేపీకి ఎన్ని ఓట్లు వస్తాయి… టీడీపీ మద్దతుదారులు తమ ఓట్లు బీజేపీకి మళ్లించారా లేదా అధికారపార్టీకే వేశారా అన్న విషయం మరో రెండు రోజుల్లో తేలిపోనుంది.
Read Also: పోరు ముగిసింది.. ఫలితమే మిగిలింది..పార్టీల్లో టెన్షన్
తాజావార్తలు
-
LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
-
Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం”: జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
-
Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!