తెలంగాణలో హుజురాబాద్ ఉపఎన్నికకు పోలింగ్ కొనసాగుతోంది. ఇందులో భాగంగా బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కమలాపూర్‌లోని 262వ నంబర్ పోలింగ్ బూత్‌లో తన భార్య జమునతో కలిసి ఈటెల రాజేందర్ ఓటు వేశారు. అనంతరం పోలింగ్ సరళిని గమనించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… హుజురాబాద్ ప్రజలు తమ గుండెల్లోని బాధలను ఓట్ల రూపంలో చూపిస్తున్నారన్నారు. పోలింగ్ ప్రారంభమైన వెంటనే వేల సంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు రావడమే దీనికి నిదర్శనమన్నారు.…