గుజరాత్ అసెంబ్లీ ఎన్నిక షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. సీఈసీ రాజీవ్ కుమార్ ఎన్నికలకు సంబంధించిన వివరాలను ప్రకటించారు. మొత్తం 182 అసెంబ్లీ స్థానాలు ఉన్న గుజరాత్ అసెంబ్లీ ఐదేళ్ల కాలపరిమితి ఫిబ్రవరి 18,2023తో ముగుస్తోంది. గత 25 ఏళ్లుగా గుజరాత్ లో బీజేపీ తిరుగలేని అధికారాన్ని చెలాయిస్తోంది. ఈ సారైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా తాను అధికారంలో ఉన్నానని చెబుతోంది.
EC Shocking decision: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్న తరుణంలో కేంద్ర ఎన్నికల కమిషన్ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్రంలోని సుమారు 900 మంది అధికారులను బదిలీ చేసింది.
Himachal pradesh Election schedule: హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తాజాగా ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించింది. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 12న జరగనున్నాయి. ఒకే దశలో ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరుపుతామని.. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ వెల్లడించారు. డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
EC allots the 'Two Swords And Shield symbol' to Eknath Shinde Shiv Sena: శివసేన పార్టీ రెండు వర్గాలుగా చీలిన సంగతి తెలిసిందే. మెజారిటీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏక్ నాథ్ షిండే వర్గంతోనే ఉన్నారు. అయితే ఉద్ధవ్ ఠాక్రే మాత్రం అసలైన శివసేన తమదే అంటోంది. ఈ వ్యవహారంపై ఇటీవల సుప్రీంకోర్టు, ఈ వ్యవహారంపై అంతిమ నిర్ణయం కేంద్ర ఎన్నికల సంఘానిదే అని చెప్పింది. నవంబర్ నెలలో అంధేరీ ఈస్ట్ నియోజకవర్గానికి ఉప…
మహారాష్ట్రలో ఉద్ధవ్ థాక్రేపై తిరుగుబాటు జెండా ఎగురవేసి.. అందినకాడికి ఎమ్మెల్యేలను లాక్కెళ్లిన ఏక్‌నాథ్ సిండే.. ఆ తర్వాత బీజేపీతో చేతులు కలిపి ఏకంగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు.. శివసేనలో రెబల్ వర్గంగా కొనసాగుతున్నారు.. తమదే అసలైన శివసేన అంటున్నారు.. అయితే, అంధేరి ఈస్ట్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక నేపథ్యంలో.. ఇప్పుడు ఎన్నికల గుర్తులు తెరపైకి వచ్చాయి.. ఇప్పటికే శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం తమ ఆప్షన్లను ఈసీకి సమర్పించింది. మూడు గుర్తులు ఎంచుకుంది.. త్రిశూలం, ఉదయించే సూర్యుడు,…
Election Commission: కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో ఒక అభ్యర్థి ఒక చోటే పోటీ చేసేలా కొత్త నిబంధనను తీసుకురావాలని కసరత్తు చేస్తోంది. ఈ మేరకు శుక్రవారం నాడు కేంద్ర న్యాయశాఖకు కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ లేఖ రాశారు. వచ్చే ఎన్నికల నుంచి ఈ నిర్ణయాలు అమలు చేసేలా ప్రయత్నించాలని లేఖలో సూచించారు. ప్రస్తుతం ఎన్నికల్లో అర్హత ఉన్న ఒక అభ్యర్థి రెండు వేర్వేరు నియోజకవర్గాల నుంచి పోటీ చేసే…
Election Commission of India: ఎలాంటి కార్యకలాపాలు లేకుండా నిష్క్రియాపరంగా ఉన్న రాజకీయ పార్టీలపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ చర్యలకు ఉపక్రమించింది. మొత్తం 7 రాష్ట్రాల్లో 253 రాజకీయా పార్టీలు నిష్క్రియాపరంగా ఉన్నాయని కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించింది. వీటిలో 86 పార్టీల ఉనికి, మనుగడే లేదని ఓ ప్రకటనలో తెలిపింది. 253 రాజకీయ పార్టీలలో 66 పార్టీలు ఒకే ఎన్నికల గుర్తు కావాలని కోరి.. ఏ ఎన్నికల్లోనూ ఒక్క అభ్యర్థిని కూడా పోటీలో నిలపలేదని…
EC sends opinion to Governor on disqualification plea against Jharkhand CM’s brother: జార్ఖండ్ రాజకీయం మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే సీఎం హేమంత్ సోరెన్ పై అనర్హత వేటు వేయాలని కేంద్ర ఎన్నికల సంఘం గవర్నర్ రమేష్ బైస్ కు తన అభిప్రాయాన్ని తెలిపింది. దీంతో జార్ఖండ్ రాజకీయాలు రసవత్తరంగా మాారాయి. ఇదిలా ఉంటే గవర్నర్ రమేష్ బైస్ ఇప్పటికీ సీఎం హేమంత్ సోరెన్ అనర్హత విషయాన్ని అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయకపోవడంతో రాష్ట్రంలో…
Telangana Young Voters: తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 18-19 ఏళ్ల మధ్య వయసు ఓటర్ల సంఖ్య లక్షా 36 వేల 496 మాత్రమే. అయితే ఈ సంఖ్య త్వరలోనే రికార్డు స్థాయిలో ఏకంగా ఎనిమిది రెట్లు పెరగనుంది. తద్వారా 10 లక్షల మార్కును చేరుకోనుంది.