CM KCR: నేటి నుంచి కేసీఆర్ రెండో విడత జన ఆశీర్వాద సభ.. ఈరోజు ఎక్కడంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM KCR: రాష్ట్రంలో అధికార బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులకు మద్దతుగా నేటి నుంచి సీఎం కేసీఆర్ రెండో విడత జన ఆశీర్వాద సభల్లో పాల్గొననున్నారు. మూడు రోజుల బ్రేక్ తర్వాత మళ్ళీ కేసీఅర్ ఎన్నికల ప్రచారం స్టార్ట్ కానుంది. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలకు హాజరై.. అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. నవంబర్ 9న నామినేషన్లు వేసి కామారెడ్డిలో సభతో ఆ విడత షెడ్యూల్ పూర్తి చేశారు. తాజాగా మళ్లీ నేటి నుంచి ప్రచారానికి రెడీ కానున్నారు. ఇదిలా ఉంటే.. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో కొద్దిగా స్పీడ్ పెంచనున్నారు. ప్రతి రోజూ 3 నుంచి 4 సభల్లో పాల్గొనేలా షెడ్యూల్ చేసుకున్నారు. 16 రోజులు 54 సభల్లో కేసీఆర్ పాల్గొననున్నారు. ఈ నెల 28న వరంగల్ తూర్పు, పశ్చిమ, గజ్వేల్ ప్రజా ఆశీర్వాద సభతో సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈ నెల 28 వరకు 54 సభల్లో ఆయన పాల్గొంటారు. ఇప్పటికే తొలి ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ పాల్గొన్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే ఇవాళ బూర్గంపహాడ్, దమ్మపేట, నర్సంపేటలో కేసీఆర్ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొననున్నారు. భద్రాచలం, పినపాక కలిపి ఒకే సభ ఉండనుంది. 14న పాలకుర్తి, నాగార్జునసాగర్(హాలియా), ఇబ్రహీంపట్నం, 15న బోధన్, నిజామాబాద్ అర్బన్, ఎల్లారెడ్డి, మెదక్, 16న ఆదిలాబాద్, బోథ్, నిజామాబాద్ రూరల్, నర్సాపూర్, 17న కరీంనగర్, చొప్పదండి, హుజూరాబాద్, పరకాల, 18న జనగాంలో రోడ్డుషో, 19న ఆలంపూర్, కల్లాపూర్, నాగర్ కర్నూల్, కల్వకుర్తి, 20న మానకొండూరు, స్టేషన్ ఘన్ పూర్, నకిరేకల్, నల్లగొండ, 21న మధిర, వైరా, డోర్నకల్, సూర్యాపేట, 22న తాండూరు, కొడంగల్, మహబూబ్ నగర్, పరిగి, 23న మహేశ్వరం, వికారాబాద్, జహీరాబాద్, పటాన్ చెరువు, 24న మంచిర్యాల, రామగుండం, ములుగు, భూపాలపల్లి, 25న హైదరాబాద్‌లో పబ్లిక్ మీటింగ్, 26న ఖానాపూర్, జగిత్యాల, వేములవాడ, దుబ్బాక, 27న షాద్ నగర్, చేవెళ్ల, ఆందోల్, సంగారెడ్డి, 28న వరంగల్ (ఈస్ట్+వెస్ట్), గజ్వేల్‌లో నిర్వహించే ఎన్నికల ప్రచార సభల్లో కేసీఆర్ పాల్గొని ప్రసంగించనున్నారు.
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
Also Read
- In Service Teachers TET: బిగ్ అలర్ట్.. అక్టోబర్ 1న మరో టెట్ నోటిఫికేషన్..
- 22A Registrations: తెలంగాణలో 22-A ఆస్తుల రిజిస్ట్రేషన్లకు గ్రీన్ సిగ్నల్.. కానీ షరతులు వర్తిస్తాయ్..
- New Bus Stands: ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త.. తెలంగాణలో మరో 13 కొత్త బస్టాండ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
- TGTET Results 2026: తెలంగాణ ఇన్-సర్వీస్ ఫలితాలు విడుదల.. 70 శాతం దాటిన ఉత్తీర్ణత..!
తాజావార్తలు
-
Vijayawada: పేదలకు సీఎం చంద్రబాబు గుడ్‌న్యూస్.. 24 వేలకుపైగా కుటుంబాలకు ఇళ్ల పట్టాలు
-
UP Elections: యూపీలో మళ్లీ బీజేపీదే అధికారం.. లేటెస్ట్ సర్వేలో వెల్లడి..
-
Thailand Floods: థాయ్‌లాండ్‌ను ముంచెత్తిన భారీ వరదలు.. కొట్టుకుపోయిన వందలాది కార్లు.. ఎమర్జెన్సీ ప్రకటన
-
Maruti Suzuki: దేశంలోనే చౌకైన CNG కారు.. కానీ కొనుగోళ్లు మాత్రం ‘సున్నా’..
-
Chiranjeevi – Odela Movie: ‘కాకా’ తర్వాత శ్రీకాంత్ ఓదెలతో సినిమా డౌటేనా?.. మెగా కాంబోపై సస్పెన్స్!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?