తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ విజయవాడకు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కోదాడకు బయల్దేరి వెళ్లారు. ఆయనతో పాటు ఏపీ కాంగ్రెస్ నేతలు రఘువీరారెడ్డి, గిడుగు రుద్రరాజు.. తెలంగాణ, కర్ణాటక కాంగ్రెస్ నేతలు ఉన్నారు. డీకే శివకుమార్ కోదాడ, హుజుర్‌నగర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా విజయవాడలో ఆయన మాట్లాడుతూ.. మూడు అసెంబ్లీ స్థానాల్లో ప్రచారం చేస్తానని తెలిపారు. తెలంగాణ మొత్తం మార్పుకోసం చూస్తోందని.. సోనియాకు కృతజ్ఞత చెప్పాలని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారని చెప్పారు. ఇక ఈ ఎన్నికల తర్వాత కేసీఆర్ ఫాంహౌస్‌లో రెస్ట్ తీసుకోవాల్సిందేనని డీకే శివకుమార్ విమర్శించారు.
Read Also: Nandigam Suresh: సీఎం జగన్ ప్రతి పేదవాడి ఇంట్లో ఆనందం నింపారు…
సీఎం కేసీఆర్ ఎప్పుడూ మమ్మల్ని తలుచుకోనిదే నిద్రపోడని డీకే శివకుమార్ దుయ్యబట్టారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తరుఫున ఐదు గ్యారెంటీలు అమలవుతున్నాయని తెలిపారు. సీఎం కుర్చీకోసం కొట్లాటలు జరగడం లేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో విజయం సాధించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో అసమర్థ పాలనతో ప్రజలు విసిగిపోయారని శివకుమార్ ఆరోపించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుందని.. ప్రజలు కూడా ఇప్పటికే కేసీఆర్ ను సాగ నంపడానికి సిద్ధమయ్యారని ఆయన తెలిపారు.
Read Also: Google: వచ్చే నెలలో మిలియన్ సంఖ్యలో Gmail అకౌంట్ల తొలగింపు.. నివారించడం ఎలాగంటే..?
ఇదిలా ఉంటే.. కామారెడ్డిలో జరిగిన సభలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య హాజరయ్యారు. ఇప్పుడు డీకే శివకుమార్ ప్రచారం నిర్వహించనున్నారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో హస్తం పార్టీ నేతలు స్పీడ్ పెంచారు. అంతకుముందు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ తెలంగాణలో పర్యటించారు. ఈ ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా కాంగ్రెస్ ప్రచారంలో దూసుకుపోతుంది.