ఖమ్మం జిల్లాలో ఈనెల 4న ( శనివారం ) ముదిగొండ మండలం యడవల్లి నుంచి మధిర నియోజకవర్గం ఎన్నికల ప్రచారానికి సీఎల్పీ నేత, మధిర కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మల్లు భట్టి విక్రమార్క ప్రారంభించనున్నారు. తొలుత యడవల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో ఉదయం ప్రత్యేక పూజలు చేసి అనంతరం ప్రచారం ప్రారంభం చేస్తారు. ఇక, మొదటి రోజు యడవల్లి, లక్ష్మీపురం(వై), మేడిపల్లి, దనియలగుడేము, కట్టకూరు, సీతారాంపురం, మాధాపురం గ్రామాల్లో భట్టి విక్రమార్క ప్రచారం సాగనుంది. తొలి రోజు ప్రచారానికి భారీ ఎత్తున ముదిగొండ మండల కాంగ్రెస్ నాయకత్వం ఏర్పాట్లు చేస్తున్నారు.
Read Also: Chandrababu: చంద్రబాబుపై మరో కేసు నమోదు
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రచార పర్యటన వివరాలు ఇవే..!
1) ఉదయం 07.30 గంటలకు పూజ…
2) ఉదయం 08:00 నుండి 9:30 వరకు యడవల్లి….
3) ఉదయం 10:00 నుండి 11:00 గంటల వరకు యడవల్లి లక్ష్మీపురం…
4) ఉదయం 11:00 నుండి 12:00 గంటల వరకు మేడిపల్లి
5) మధ్యాహ్నం 12:00 నుండి01:00 గంటల వరకు ధనియాల గూడెం
6) మధ్యాహ్నం 01:00 నుండి 02:00 వరకు బోజన విరామం
7) మధ్యాహ్నం 2:30 నుండి 3:30 వరకు కట్టకురు
8) సాయంత్రం 04:00 నుండి 5:00 గంటల వరకు సీతారాం పురం
9) రాత్రి 07:00 నుండి 09:00 గంటల వరకు మాధాపురము..