తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం తుదిఘట్టానికి చేరుకుంది. పోలింగ్ సమయం సమీపిస్తున్న తరుణంలో ప్రధాన పార్టీలు ఇప్పటికే ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఇందు కోసం కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన జాతీయ నేతలను రంగంలోకి దిగి ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా కాషాయ జాతీయ దళమంతా తెలంగాణ రాష్ట్రానికి పోటెత్తుతోంది. ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాష్ట్రంలో పర్యటిస్తూ జోరుగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఇవాళ కూడా ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. నేడు మూడు నియోజకవర్గాల్లో నిర్వహించనున్న బహిరంగ సభకు అమిత్ షా హాజరవుతారు. అనంతరం ఖైరతాబాద్ నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించనున్నారు. మరోవైపు రేపు కూడా రాష్ట్రంలో అమిత్ షా ఎన్నికల ప్రచారం చేయనున్నారు.
Read Also: Rajasthan Elections 2023: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ షురూ!
అమిత్ షా షెడ్యూల్ ఇదే..
* ఇవాళ కొల్లాపూర్, మునుగోడు, పటాన్‌చెరులో బీజేపీ సకల జనుల విజయ సంకల్ప సభలో పాల్గొననున్న కేంద్ర హోం మంత్రి అమిత్‌షా
* సాయంత్రం ఖైరతాబాద్‌లో నిర్వహించే రోడ్ షోలో పాల్గొననున్న అమిత్‌షా
* రేపు మక్తల్, ములుగు, భువనగిరి సభల్లో పాల్గొననున్న అమిత్‌షా
* రేపు సాయంత్రం కూకట్‌పల్లి బహిరంగ సభకు అమిత్ షా హాజరు