కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ ఉమ్మడి నాలుగు జిల్లాల్లో గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఈ నెల 27న పోలింగ్ జరుగనున్నది. కాగా పట్టభద్రుల స్థానం నుంచి బీజేపీ ఎమ్ఎల్సీ అభ్యర్థిగా డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి పోటీచేస్తున్నారు. గెలుపే లక్ష్యంగా ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఈ క్రమంలో సంగారెడ్డిలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి మాట్లాడుతూ.. 13 జిల్లాల్లో 271 పట్టణాలు, 499 పోలింగ్ బూత్ లున్నాయని తెలిపారు. ఏ బూత్ కు వెళ్లిన బ్రహ్మాండమైన ఆదరణ లభిస్తుందని అన్నారు.
Also Read:Lalit Modi: వాలంటైన్స్ డే రోజున మరో కొత్త ప్రేయసిని పరిచయం చేసిన లలిత్ మోడీ
ఇటీవల పీఎం మోడీ ఇన్ కమ్ ట్యాక్స్ రిలీఫ్ కలిగించడంతో కోట్లాది మందికి ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. రూ. 12 లక్షల ఆదాయం ఉన్న ఉద్యోగులకు ఇన్ కమ్ ట్యాక్స్ నుంచి మినహాయింపు కలిపించారు. రిటైర్డ్ ఎంప్లాయీస్, పెన్షనర్లకు, చిన్న వ్యాపారస్తులకు ప్రయోజనం చేకూరనున్నదని తెలిపారు. అన్ని వర్గాలకు కాంగ్రెస్ మోసం చేసిందని అన్నారు. అందుకే మొన్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఖాతా తెరవకుండా కనుమరుగైందని వెల్లడించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చని హామీలిచ్చిందని చెప్పారు. నిరుద్యోగులు, విద్యార్థులు, రైతులు ఇలా అన్ని వర్గాల వారిని మోసం చేసిందని తెలిపాడు. నిరుద్యోగ భృతి రూ. 4 వేలు ఇస్తామని నిరుద్యోగుల ఓట్లు దండుకున్న కాంగ్రెస్ గెలిచిన తర్వాత విస్మరించిందని అన్నారు.
Also Read: GBS Virus In AP: ఏపీలో జీపీఎస్ వైరస్ కేసులు నమోదు.. మంత్రి కీలక సూచనలు
నిరుద్యోగ భృతి చెల్లించి ఓట్లు అడగాలని కాంగ్రెస్ ను డిమాండ్ చేశారు. మహాలక్ష్మీ పథకం ద్వారా మహిళలకు రూ. 2500 ఇచ్చాకే ఓట్లు అడగాలని అన్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినంకనే కాంగ్రెస్ ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు. మండలిలో ప్రశ్నించే గొంతు కావాలంటే బీజేపీని గెలిపించాలని కోరారు. మోడీ హయాంలో అవినీతి లేని పాలన దేశంలో అమలవుతోందని అన్నారు. మేధావులు అంతా ఆలోచించి కాంగ్రెస్ కు ఓట్లతో బుద్ధి చెప్పాలని కోరారు. కాంగ్రెస్ క్యాండిడేట్ నరేందర్ రెడ్డికి సవాల్ విసిరారు. మీ ప్రభుత్వమే కాబట్టి విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులు రీలీజ్ చేశాకే ఓట్లు అడగాలని సవాల్ విసిరారు. మొల్కా కొమురయ్యకు, తనకు మొదటి ప్రాధాన్యతా ఓటు వేసి గెలిపించాలని డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి కోరారు.