మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, శివసేన అధినేత ఏక్‌నాథ్ షిండే ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. కుమారుడు, ఎంపీ శ్రీకాంత్ షిండే, కోడలు వృషాలి షిండేతో కలిసి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. హస్తిన పర్యటనలో హైకమాండ్ పెద్దలను కలుస్తున్నారు. గురువారం ప్రధాని మోడీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను షిండే కలిశారు. మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత షిండే తొలి ఢిల్లీ పర్యటన ఇదే. ఇటీవల మంత్రివర్గ విస్తరణ సమయంలో దేవేంద్ర ఫడ్నవిస్, అజిత్ పవార్ ఢిల్లీలో పర్యటించినా.. షిండే మాత్రం హస్తినకు వెళ్లలేదు. తాజాగా కుటుంబంతో కలిపి ఢిల్లీలో పర్యటిస్తున్నారు.
భేటీ అనంతరం షిండే మీడియాతో మాట్లాడారు. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పడి.. మంత్రివర్గ విస్తరణ తర్వాత ప్రధానమంత్రిని కలిసినట్లు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం, పార్టీ విజయానికి చేసిన కృషిపై ప్రధాని మోడీ అభినందించినట్లు తెలిపారు. ఫడ్నవిస్, అజిత్ పవార్‌తో కలిసి రాష్ట్రాభివృద్ధికి వ్యూహాన్ని రూపొందిస్తామని వెల్లడించారు. దీనిపై ప్రధాని మోడీతో కూడా చర్చించినట్లు పేర్కొన్నారు.
శ్రీకాంత్ షిండే మహారాష్ట్రలోని కళ్యాణ్ స్థానం నుంచి లోక్‌సభ ఎంపీగా ఉన్నారు. శ్రీకాంత్ షిండే భార్య వృశాలి షిండే కూడా ఢిల్లీ టూర్‌లో ఉన్నారు. ముగ్గురు అగ్ర నేతలను వరుసగా కలిశారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. 288 అసెంబ్లీ స్థానాలకు 230 స్థానాలు మహాయుతి కూటమి సొంతం చేసుకుంది. బీజేపీ 132, శివసేన 57, ఎన్సీపీ 41 స్థానాల్లో విజయం సాధించాయి. ఇక మంత్రివర్గంలో
39 మంది మంత్రులు ఉన్నారు. బీజేపీ నుంచి 19 మంది, శివసేన నుంచి 11 మంది, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గానికి చెందిన తొమ్మిది మంది మంత్రులు ఉన్నారు. ఏకనాథ్ షిండేకు పట్టణాభివృద్ధి, పబ్లిక్ వర్క్స్ శాఖను కేటాయించారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ హోం, ఇంధనం, న్యాయ శాఖలను తన దగ్గరే ఉంచుకున్నారు. అజిత్ పవార్‌కు ఆర్థిక శాఖ బాధ్యతలు అప్పగించారు.
#WATCH | Maharashtra Deputy CM Eknath Shinde says, "After the formation of government in Maharashtra and the expansion of the cabinet, I met with the PM and he congratulated us for the success and the work we did for the development of the state…I, Ajit Pawar and Devendra… pic.twitter.com/hLXimtaDW2
— ANI (@ANI) December 26, 2024
Maharashtra Deputy CM & Shiv Sena chief Eknath Shinde along with his son and MP Shrikant Shinde and daughter-in-law Vrushali Shinde meet Union Home Minister Amit Shah
(Source: Shiv Sena) pic.twitter.com/CQLqfBrCSh
— ANI (@ANI) December 26, 2024
Maharashtra Deputy CM & Shiv Sena chief Eknath Shinde along with his son and MP Shrikant Shinde and daughter-in-law Vrushali Shinde meet Union Minister and BJP president JP Nadda, in Delhi
(Source: BJP) pic.twitter.com/zPRGsckVPG
— ANI (@ANI) December 26, 2024
देशाचे लोकप्रिय पंतप्रधान व विश्व नेते मा. @narendramodi जी यांची आज नवी दिल्लीतील त्यांच्या निवासस्थानी भेट घेतली. महाराष्ट्रात विक्रमी जनादेश मिळाल्यानंतर महायुतीचे सरकार राज्यात स्थापन झाले आहे. या पार्श्वभूमीवर, 'विकसित भारताच्या वाटचालीत राज्याचा योगदानाबाबत मा. मोदीजी… pic.twitter.com/j9xRKqGhjM
— Eknath Shinde – एकनाथ शिंदे (@mieknathshinde) December 26, 2024