తాను సావర్కర్ కానందున క్షమాపణ చెప్పబోనని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ప్రత్యర్థులైన మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే, శివసేన అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే మధ్య ఐక్యతకు దారితీసింది. కాగా, 2019 పరువు నష్టం కేసులో గుజరాత్‌లోని సూరత్‌లోని కోర్టు గాంధీని దోషిగా నిర్ధారించిన మరుసటి రోజు, శుక్రవారం లోక్‌సభకు గాంధీ అనర్హుడయ్యాడు.
Uddhav Thackeray: ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన రాజకీయ లబ్ధి కోసమే హిందుత్వాన్ని విడిచిపెట్టి, సూడో సెక్యుటర్ ఎజెండాను అవలంభిస్తోందని బీజేపీ, సీఎం ఏక్ నాథ్ షిండే శివసేన ఆరోపిస్తోంది. శరద్ పవార్ ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీతో కలిసి ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని అన్నారు. అయితే ఈ విమర్శలకు ఉద్ధవ్ ఠాక్రే ఘాటుగానే బదులిచ్చారు. బీజేపీ రథయాత్ర చేసినప్పుడు మద్దతు ఇచ్చిన ఏకైక పార్టీ శివసేన అని ఉద్దవ్ అన్నారు.
ఎన్నికల సంఘం పూర్తిగా రాజీపడిందని శివసేన (యూబీటీ) నాయకుడు ఆదిత్య ఠాక్రే ఆదివారం ఆరోపించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని వర్గాన్ని శివసేనగా గుర్తించి దానికి విల్లు, బాణం గుర్తును కేటాయించడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని అన్నారు.
మహారాష్ట్రలో అధికారంలో ఉన్న ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని సర్కారు తమ మొదటి బడ్జెట్‌ను రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. 2023-24 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గురువారం రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.
Eknath Shinde : ఆయనో రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అయితేనేం సీఎం, పీఎం ఎవరైనా మనుమడి మాటల తలొగ్గాల్సిందే.. వాళ్లు మంకు పట్టు తీర్చాల్సిందే. ఈ మాట ఇప్పుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే విషయంలో జరిగింది.
ఔరంగాబాద్, ఉస్మానాబాద్ నగరాల పేర్లు వరుసగా ఛత్రపతి శంభాజీ నగర్, ధరాశివ్‌గా మార్చబడ్డాయి. శుక్రవారం హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ ప్రతిపాదనను ఆమోదించింది.
శివసేన పార్టీ పేరు, గుర్తును ఏక్‌నాథ్ షిండే వర్గానికి కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించింది. ఈ ఆదేశాలను వ్యతిరేకిస్తూ ఉద్దవ్ థాక్రే వర్గం సుప్రీం కోర్టును ఆశ్రయించింది.
Sanjay Raut Claims Threat To Life: ఉద్ధవ్ ఠాక్రే వర్గం నేత ఎంపీ సంజయ్ రౌత్ సంచలన ఆరోపనలు చేశారు. ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే కుమారుడి నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆరోపించారు. లోక్ సభ ఎంపీ శ్రీకాంత్ షిండే(ఏక్ నాథ్ షిండే కుమారుడు) నన్ను చంపేందుకు థానేకు చెందిన నేరస్థుడు రాజా ఠాకూర్‌కు సుపారీ ఇచ్చాడని..బాధ్యత కలిగిన పౌరుడిగా మీకు తెలియజేస్తున్నా అని పోలీసులకు లేఖ రాశారు. అయితే సంజయ్ రౌత్ ఆరోపనలను…
Sanjay Raut: శివసేన పార్టీ, ఎన్నికల గుర్తు ‘విల్లు-బాణం’ను కోల్పోవడంపై ఉద్దవ్ ఠాక్రే వర్గం నాయకుడు ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు. ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం న్యాయం కాదని.. వ్యాపారం ఒప్పందం అని దీని కోసం ఏకంగా 6 నెలల్లో రూ. 2000 కోట్ల విలువైన లావాదేవీలు జరిగినట్లు ఆరోపించారు. రూ. 2000 కోట్ల కేవలం ప్రాథమిక అంచనా అని.. ఇది వందశాతం నిజమని, అధికార పక్షానికి దగ్గరగా ఉండే ఓ బిల్డర్ ఈ విషయాలను…