మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేతో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ( ఎన్సీపీ ) అధినేత శరద్ పవార్ భేటీ అయ్యారు. దీంతో ఒక్కసారి ఈ విషయం పొలిటికల్ సర్కిల్ లో తీవ్ర చర్చనీయాంశమైంది.
Savitribai Phule: ప్రముఖ సంఘ సంస్కర్త.. మొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా పేరున్న సావిత్రీబాయి ఫూలేపై కొన్ని వెబ్‌సైట్లు అభ్యంతరక కథనాలు పోస్టు చేశాయి. అభ్యంతరక కథనాలను పోస్టు చేసిన రెండు వెబ్‌సైట్లపై మహారాష్ట్ర పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
శివసేన, సేన పోరుపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే రాజీనామా చేయాలని డిమాండ్ చేయాల్సిన అవసరం లేదని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత అజిత్ పవార్ శుక్రవారం అన్నారు.
మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మహారాష్ట్రలో జూన్ 2022 రాజకీయ సంక్షోభంపై ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం తన ఉత్తర్వును ప్రకటించింది. ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వానికి పెద్ద ఊరటనిస్తూ, ఉద్ధవ్ థాకరే బలపరీక్షను ఎదుర్కోకుండా రాజీనామా చేసినందున ఆయన ప్రభుత్వాన్ని పునరుద్ధరించమని ఆదేశించలేమని సుప్రీంకోర్టు పేర్కొంది.
Building Collapse: మహారాష్ట్రలో ఘోరం చోటు చేసుకుంది. థానే జిల్లా భివాండి ప్రాంతంలో పాత భవనం కూలి ముగ్గురు మృతి చెందారు. వారిలో ఐదేళ్ల చిన్నారి కూడా ఉంది.
మహారాష్ట్రకు తొందరలోనే కొత్త ముఖ్యమంత్రి రాబోతున్నారని ఎన్సీపీ అధికార ప్రతినిధి క్లైడ్ క్యాస్ట్రో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాఫిక్ గా మారాయి. ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాలని కమలం పార్టీ ఏక్ నాథ్ షిండేకు హుకుం జారీ చేసిందని.. దీంతో ఆయన మనస్తాపంతో మూడు రోజుల పాటు సెలవులు పెట్టి వెళ్లారని క్యాస్ట్రో అన్నారు.
మహారాష్ట్ర రాజకీయాలు ఆసక్తికంగా మారాయి. ఎన్సీపీ సీనియర్ నేత అజిత్ పవార్ బీజేపీతో కలుస్తారన్న ప్రచారంతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. తన మద్దతుదారులతో బీజేపీలో చేరేందుకు అజిత్ పవార్ చర్చలు జరుపుతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.
మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే ఆదివారం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను ఆయన అధికారిక నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. షిండేతో పాటు ఆయన ప్రభుత్వ మంత్రుల బృందం కూడా ఉంది.
ప్రధాని మోడీ డిగ్రీల వివరాలను అడిగినందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు గుజరాత్ హైకోర్టు రూ. 25 వేల జరిమాన విధించింది. ఈ నేపథ్యంలోనే శివసేన నాయకుడు ఉద్దవ్ థాకరే ప్రధాని మోడీ డిగ్రీ వివాదంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.