Savitribai Phule: ప్రముఖ సంఘ సంస్కర్త.. మొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా పేరున్న సావిత్రీబాయి ఫూలేపై కొన్ని వెబ్‌సైట్లు అభ్యంతరక కథనాలు పోస్టు చేశాయి. అభ్యంతరక కథనాలను పోస్టు చేసిన రెండు వెబ్‌సైట్లపై మహారాష్ట్ర పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. 19వ శతాబ్దానికి చెందిన సంఘ సంస్కర్త సావిత్రీబాయి ఫూలేపై అభ్యంతరకర కథనాలు ఉన్నాయన్న ఆరోపణలపై ముంబై పోలీసులు రెండు వెబ్‌సైట్లపై కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. పరువునష్టం శిక్ష సహా ఇండియన్ పీనల్ కోడ్ (IPC)లోని సంబంధిత సెక్షన్ల కింద ఇండిక్ టేల్స్ మరియు హిందూ పోస్ట్‌పై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు అధికారి తెలిపారు.
Read Also: Modern Woman: ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వాడొద్ధన్నందుకు భర్తను వదిలేసిన భార్య
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి)కి చెందిన అజిత్ పవార్, జయంత్ పాటిల్, సునీల్ తట్కరే మరియు ఛగన్ భుజ్‌బల్‌తో పాటు పార్టీ కార్యకర్తలు ముంబై పోలీసు కమీషనర్ కార్యాలయం వెలుపల సావిత్రివాయి పూలేపై అభ్యంతరకరమైన కథనాలను ఆరోపించిన రెండు వెబ్‌సైట్‌లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. భారతదేశపు మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రీబాయి ఫూలే, బాలికలకు చదువు చెప్పకుండా అడ్డుకోవడం కోసం వేధింపులకు పాల్పడిన వారితో ఎలా వ్యవహరించిందనేది అందరికి తెలుసన్నారు. ఇదే అంశంపై స్పందించిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే వెబ్‌సైట్లపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఐకాన్‌లుగా గుర్తింపు పొందిన వ్యక్తులకు వ్యతిరేకంగా.. అభ్యంతరకర విషయాలు రాసే వారిని వదిలిపెట్టబోమని సీఎం అన్నారు. ప్రజలను రెచ్చగొట్టే ఉద్దేశంతో ఈ చర్య చేశారని, ఫూలేపై అభ్యంతరకరమైన కథనాన్ని రాసిన వెబ్‌సైట్ మరియు రచయితపై చర్య తీసుకోవాలని కోరుతూ భుజ్‌బల్ సోమవారం సీఎం షిండేకు లేఖ రాశారు.
Read Also:Anasuya : అను ఇలా చూపిస్తే కుర్రాళ్లు తట్టుకోగలరా..