Maharastra : ఆగస్టు 26న మహారాష్ట్రలోని సింధుదుర్గ్‌లోని మాల్వాన్‌లో ఉన్న ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహం ఒక్కసారిగా కుప్పకూలింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.
Eknath Shinde: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆ రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇదిలా ఉంటే, సీఎం ఏక్ నాథ్ షిండే చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. గతంలో మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) ప్రభుత్వం దేవేంద్ర ఫడ్నవీస్‌ని అరెస్ట్ చేసేందుకు కుట్ర పన్నినట్లు ఆరోపించారు. బీజేపీని అణగదొక్కేందుకు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎంవీఏ కూటమిలో చేరడానికి చేసిన ప్లాన్ అని షిండే అన్నారు.
త్వరలోనే మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అన్ని పార్టీలు గెలుపు కోసం సంసిద్ధం అవుతున్నాయి. అధికార పార్టీ మరోసారి అధికారం కోసం ప్రయత్నిస్తుంటే.. ఇండియా కూటమి కూడా అధికారం కోసం కసరత్తు ప్రారంభించింది.
Kangana Ranaut: జ్యోతిర్మఠ్ శంకరాచార్యులు అవిముక్తేశ్వరానందర సరస్వతి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేపై చేసిన వ్యాఖ్యలపై ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఫైర్ అయ్యారు.
మహారాష్ట్రలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అన్ని పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఇక మహారాష్ట్రలో ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వం కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. నిరుద్యోగ యువత కోసం ఓ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌ను తీసుకొచ్చింది.
ముంబై పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేతో భేటీ అయ్యారు. షిండే ఆహ్వానం మేరకు సీఎం చంద్రబాబు ఆయన నివాసానికి వెళ్లి కలిశారు. మహారాష్ట్ర సీఎం అధికారిక నివాసమైన వర్షకు విచ్చేసిన చంద్రబాబుకు ఏక్‌నాథ్ షిండే ఘనంగా స్వాగతం పలికారు.
BMW Hit-And-Run Case: ముంబై బీఎండబ్ల్యూ కారుని అతివేగంతో నడుపుతూ మహిళ మరణానికి కారణమైన కేసులో ప్రధాన నిందితుడైన మిహిర్ షా అరెస్ట్ అయ్యాడు. మద్యం తాగి 45 ఏళ్ల మహిళపైకి కారుని పోనిచ్చాడు.
ముంబైలోని వర్లీ ప్రాంతంలో ఆదివారం జరిగిన ఘోర బీఎండబ్ల్యూ కారు ప్రమాదంపై ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ఆందోళన వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో హిట్ అండ్ రన్ ఘటనలు పెరిగిపోవడం పట్ల సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. హిట్ అండ్ రన్ నేరస్థులను సహించేది లేదని అన్నారు.
BMW Crash: మహారాష్ట్రలో కారు ప్రమాదం పొలిటికల్ టర్న్ తీసుకుంది. ముంబైలోని వర్లీలో ఈ రోజు ఉదయం వేగంగా వెళ్తున్న బీఎండబ్ల్యూ కారు ఢీకొని ఒక మహిళ మరణించింది.