Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఒకేరోజులో పలు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. స్కామ్‌లోని ప్రధాన నిందితుల్లో ఒకరైన శరత్ చంద్రారెడ్డికి భారీ ఊరట లభించింది. రౌస్ ఎవెన్యూ కోర్టు ఆయనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. శరత్ చంద్రారెడ్డి భార్య కనికారెడ్డి అనారోగ్య పరిస్థితి దృష్ట్యా.. ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సీబీఐ ప్రత్యేక కోర్టు.. ఇప్పుడు దాన్ని పూర్తిస్థాయి బెయిల్‌గా మార్చింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు జ్యుడీషియల్ రిమాండ్‌ను ఈనెల 23 వరకు పొడిగించింది కోర్టు. ఆయన జ్యుడీషియల్ కస్టడీ గడువు ముగియడంతో.. ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరు పరిచారు ఈడీ అధికారులు. సిసోడియాను మరింత లోతుగా విచారించాల్సిన అవసరముందని, కస్టడీని పొడిగించాలని కోరారు. దీంతో కోర్టు.. సిసోడియాకు జ్యుడీషియల్ కస్టడీని ఈనెల 23 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు మాగుంట రాఘవకు నిరాశ ఎదురైంది. ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టులో ఆయన బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిగింది. రాఘవకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. ఆయన బెయిల్ పిటిషన్‌ను కొట్టేసింది. ఇక ఇదే కేసులోని మరో ఇద్దరు నిందితులకు బెయిల్ మంజూరు చేసింది కోర్టు. రాజేష్ జోషి, గౌతమ్ మల్హోత్రాలకు రెగ్యులర్ బెయిల్ ఇచ్చింది. ఈ ఇద్దరిపై మోపిన అభియోగాల్లో మనీలాండరింగ్‌కు సంబంధించిన ఎలాంటి ఆధారాలను ఈడీ సమర్పించలేదని కోర్టు వెల్లడించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ మొత్తం ఒక బూటకమని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఇప్పుడు కోర్టులు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయని, రాజేష్ జోషి, గౌతమ్ మల్హోత్రాలకు బెయిల్ మంజూరు చేస్తూ.. కోర్టు జడ్జి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఆయన ఓ ట్వీట్ చేశారు. మద్యం కుంభకోణం అంతా బూటకమని, కేవలం ఆప్‌ను కించపరిచేందుకే.. ఈ స్కామ్‌ను సృష్టించారని తాము ముందు నుంచి చెబుతున్నామని ట్వీట్‌లో పేర్కొన్నారు కేజ్రీవాల్.
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్‌ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!