Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి చెందిన ఎంపీ సంజయ్ సింగ్‌ని ఈడీ అరెస్ట్ చేసింది. తాజాగా ఈ రోజు ఆయనకు కోర్టు అక్టోబర్ 10 వరకు 5 రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగించింది. ఈ కేసులో అంతకుముందు ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్‌తో పాటు ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసింది. ప్రస్తుతం వీరిద్దరు జైలులో ఉన్నారు. బుధవారం రోజు ఎంపీ సంజయ్ సింగ్…
రాజస్థాన్ పేపర్ లీక్ కేసులో ఈడీ కీలక చర్యలు తీసుకుంది. రాజస్థాన్ పబ్లిక్ కమిషన్ సభ్యులు అనిల్ కుమార్ మీనా, బాబులాల్ కటారాలను అరెస్ట్ చేసింది. మనీలాండరింగ్ కేసులో వీరిని అదుపులోకి తీసుకున్నట్లు ఈడీ తెలిపింది. వీరిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా.. మూడు రోజుల పాటు ఈడీ కస్టడీ కోరింది.
మహాదేవ్ గ్యాంబ్లింగ్ యాప్ నిర్వహించే కింగ్‌పిన్ సౌరభ్ చంద్రకర్ ఈ ఏడాది ఫిబ్రవరిలో దుబాయ్‌లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పెళ్లికి రూ.200 కోట్లు ఖర్చు చేసి ఘనంగా చేసుకోవడం సంచలనంగా మారింది. ఈ వివాహానికి ఇండియా నుంచి తన బంధువులే కాకుండా.. పలువురు బాలీవుడ్ ప్రముఖులు హాజరైనట్లు ఈడీ తెలిపింది.
మహాదేవ్ యాప్‌కు సంబంధించి సుమారు రూ. 5000 కోట్ల మనీ లాండరింగ్‌పై దర్యాప్తు చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు.. సూత్రధారి సౌరభ్ చంద్రకర్ విషయాలను బట్టబయలు చేశారు. అతను ఏ విధంగా మోసాలకు పాల్పడి ఎలా ఆనందించాడో అని వివరించారు.
Gangula Kamalakar: తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ కుటుంబ సభ్యులకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. గంగుల కుటుంబానికి చెందిన వైట్ గ్రానైట్లు ఫెమా నిబంధనలను ఉల్లంఘించినట్లు ఈడీ అధికారులు గుర్తించారు.
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విడివిడిగా విచారిస్తున్న ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడానికి సుప్రీంకోర్టు శుక్రవారం నిరాకరించింది.
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, సినీ నటి నుస్రత్ జహాన్‌పై ఈడీకి ఫిర్యాదు చేశారు. పశ్చిమ బెంగాల్‌లోని 24 పరగణాలు జిల్లాలో ఆమె మోసానికి పాల్పడిందంటూ ఈడీకి ఫిర్యాదు చేశారు.
ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన బొగ్గు లెవీ కుంభకోణానికి సహకరించారనే ఆరోపణలతో ఐఏఎస్ అధికారిణి రాను సాహును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.