Delhi Liquor Scam: లిక్కర్ కేసులో కీలక మలుపు.. ఛార్జిషీట్ లో మరో ముగ్గురు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Liquor Scam: ఢిల్లీ మద్యం కుంభకోణం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా కొనసాగుతోంది. ఈ కేసు విచారణ కీలక మలుపు తిరుగుతుంది. ఈడీ విచారణలో ట్విస్ట్‌లు వెలువడుతున్నాయి. తాజాగా ఈ కేసులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈడీ మరో అనుబంధ చార్జిషీట్‌ను కోర్టులో దాఖలు చేసింది. దీనికి సంబంధించిన అనుబంధ చార్జిషీట్‌ను సీబీఐ మంగళవారం దాఖలు చేసింది. ఇప్పుడు రెండు రోజుల్లో మరో అదనపు చార్జిషీటును ఈడీ దాఖలు చేసింది. ఈ కేసులో సీబీఐ, ఈడీ మరింత దూకుడు పెంచినట్లు తెలుస్తోంది.
తాజాగా ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టులో ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ మరో అదనపు చార్జ్ షీట్ దాఖలు చేసింది. ఈ చార్జిషీట్‌లో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో పాటు ప్రముఖ మద్యం వ్యాపారులు అరుణ్ రామచంద్ర పిళ్లై, అమన్‌దీప్ ధాల్‌ల పేర్లను నమోదు చేశారు. ఈ కేసులో అమన్‌దీప్ అరెస్ట్ అయి 60 రోజులు కావస్తుండడంతో.. ఈడీ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసినట్టు తెలుస్తోంది. అమన్‌దీప్‌తో పాటు మనీష్ సిసోడియా, అరుణ్ పిళ్లైలను కూడా అరెస్టు చేయగా, ముగ్గురి పేర్లతో ఈడీ కోర్టులో అనుబంధ ఛార్జిషీట్‌ను దాఖలు చేసింది.
Also Read
- CM Revanth Reddy : ఖేలో ఇండియా గేమ్స్‌కు తెలంగాణ రెడీ.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు!
- Massive Accidents : NH-65పై మృత్యుఘోష.. ఒకే రోజు 9 మంది బలి.!
- Telangana Public Schools : తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు డెడ్‌లైన్.. డిసెంబర్లోనే రెడీ.!
- OTR : ఆదాయం రూ.14 కోట్లు.. అప్పు రూ.300 కోట్లు..! కొత్తగూడెంలో ఇదేం లెక్క..?
ఈ కేసులో ఇప్పటి వరకు ఈడీ మూడు ఛార్జిషీట్లు దాఖలు చేసింది. కొత్తగా దాఖలు చేసిన చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకోవాలా? లేదా? దీనిపై ఇవాల (శుక్రవారం) ప్రత్యేక న్యాయమూర్తి నిర్ణయం తీసుకోనున్నారు. అనంతరం విచారణ జరుపుతారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ముగ్గురి పాత్రను ఈడీ చార్జిషీట్‌లో స్పష్టంగా పేర్కొంది. గతంలో ఈడీ కేసులో మనీష్ సిసోడియాను ఏప్రిల్ 29 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. రేపటితో కస్టడీ ముగియనుండడంతో ఈరోజు ప్రత్యేక కోర్టులో చార్జిషీటుపై విచారణ జరగనుంది. అయితే ఫిబ్రవరి 26న మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేయగా.. మార్చి 9న ఈడీ అరెస్ట్ చేసింది. మార్చి 1న అమన్‌దీప్ ధాల్‌ను ఈడీ కస్టడీలోకి తీసుకుంది. మార్చి 6న అరుణ్ పిళ్లైని ఈడీ అరెస్ట్ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాలోని సౌత్ గ్రూప్ ప్రతినిధిగా అరుణ్ పిళ్లై కీలక పాత్ర పోషించినట్లు ఈడీ గుర్తించింది.
Viral Video: ఛా.. ఈ ట్రిక్ తెలియక ఇప్పటికి ఎన్నోసార్లు ఫైన్ కట్టానో..
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..