మనీలాండరింగ్ కేసు విచారణలో భాగంగా శుక్రవారం ఛత్తీస్గఢ్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కొందరు ఐఏఎస్ అధికారులు, కాంగ్రెస్ నేతపై దాడులు చేసింది. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్) అధికారి రాను సాహు, మరికొందరు బ్యూరోక్రాట్లు, ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ నాయకుడు, పీసీసీ కోశాధికారి రాంగోపాల్ అగర్వాల్కు సంబంధించిన ఇళ్లలో దాడులు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఢిల్లీ రాష్ట్ర మద్యం కుంభకోణం కేసులో స్పందించాలని కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED)లకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు కీలక విన్నపం వచ్చింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి ఇచ్చిన అధికారాలకు పగ్గాలు వేయాలని లేకపోతే దేశంలో ఎవరూ ప్రశాంతంగా ఉండలేరని పిటిషన్లో పేర్కొన్నారు.
Nitish Kumar: ప్రతిపక్షాల ఐక్యతే లక్ష్యంగా బీహార్ సీఎం నితీష్ కుమార్ పావులు కదుపుతున్నారు. ఈ నెల 23న నితీష్ నేతృత్వంలో పాట్నాలో విపక్షాల సమావేశం జరగబోతోంది. ఈ సమావేశానికి కాంగ్రెస్ తో సహా ఎన్సీపీ, శివసేన(ఉద్ధవ్), టీఎంసీ, ఆర్జేడీ, ఆప్ వంటి పార్టీలు హాజరుకాబోతున్నాయి. ఇదిలా ఉంటే ఈ నెల 20న నితీష్ కుమార్ తమిళనాడు పర్యటకు వెళ్లనున్నారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ని కలిసేందుకు ఆయన వెళ్లనున్నారు. విపక్షాల ఐక్యత లక్ష్యంగా ఈ…
Sukesh Chandrashekhar: అవినీతి, మనిలాండరింగ్ కేసుల్లో సుకేష్ చంద్రశేఖర్ ను ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసింది. అతను అక్కడ నుంచి ఆప్ పార్టీ, సీఎం కేజ్రీవాల్ టార్గెట్ గా పలు ఆరోపణలు చేశారు. మరోవైపు తన ప్రియురాలు, బాలీవుడ్ నటి జాక్వలిన్ ఫెర్నాండెస్ కు ప్రేమ లేఖలు కూడా రాస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇదిలా ఉంటే మరోసారి వార్తల్లో వ్యక్తిగా మారారు సుకేష్ చంద్రశేఖర్. ఇటీవల ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంలో బాధితుల కోసం ఏకంగా…
MK Stalin: తమిళనాడు అధికార డీఎంకే పార్టీకి చెందిన మంత్రి వి. సెంథిల్ బాలాజీపై ఈడీ దాడులు, అరెస్ట్ చేయడం డీఎంకే, బీజేపీ పార్టీల మధ్య ఘర్షణను పెంచాయి. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కేంద్ర సంస్థలన్ని ఉపయోగించి ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తోందని, సమాఖ్య వ్యవస్థను దెబ్బతీస్తోందని సీఎం స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Tamil Nadu: తమిళనాడు ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య ఘర్షణ తారాస్థాయికి చేరింది. సీఎం స్టాలిన్ క్యాబినెట్ మంత్రి వి. సెంథిల్ బాలాజీని ఈడీ అరెస్ట్ చేయడంతో ఒక్కసారిగా తమిళనాడులో రాజకీయాలు వేడెక్కాయి. అధికార డీఎంకే పార్టీ ఈడీ రైడ్స్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతుందని ముఖ్యమంత్రి స్టాలిన్ ఆరోపిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ తో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీలు కూడా డీఎంకేకు మద్దతు పలుకుతున్నాయి.
FEMA Violation: రూ.5,551 కోట్ల ఫెమా ఉల్లంఘన కేసులో షియోమీ టెక్నాలజీ ఇండియా, సీఎఫ్ఓ సమీర్ రావు, మాజీ ఎండీ మను జైన్ సహా 3 బ్యాంకులకు ఈడీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది.