TMC MP: టీఎంసీ ఎంపీపై ఈడీకి ఫిర్యాదు.. తక్కువ ధరకే త్రిబుల్ బెడ్‌రూమ్ ఇస్తామని మోసం చేసిందని కంప్లైంట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TMC MP: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, సినీ నటి నుస్రత్ జహాన్‌పై ఈడీకి ఫిర్యాదు చేశారు. పశ్చిమ బెంగాల్‌లోని 24 పరగణాలు జిల్లాలో ఆమె మోసానికి పాల్పడిందంటూ ఈడీకి ఫిర్యాదు చేశారు. గతంలో ఆమె కేవలం రూ.6 లక్షలకే త్రిబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ ఇస్తామని డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపించారు. ఆమె ప్రకటించిన ఐదేళ్లు పూర్తయినా ఇప్పటివరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. తమకు త్రిబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్స్ తక్కువ ధరకే అందిస్తామని మోసం చేశారంటూ సాల్ట్ లేక్ ఈడీ కార్యాలయంలో బాధితులు ఫిర్యాదు చేశారు. సెవెన్ సెన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో మోసాలకు పాల్పడ్డారని వారు ఆరోపించారు.
Read also: VRAs: తెలంగాణలో వీఆర్ఏలను ఇతర శాఖలకు పంపేందుకు రంగం సిద్ధం
Also Read
- CJP Protest: ఆప్‌లో కీలక నేత, ఇప్పుడు కాక్రోచ్లకు పెద్ద దిక్కు.. ఎవరీ అజింక్యా షిండే.?
- Sudha Murty: చీర కట్టుకుంటే ‘బెహన్జీ’ అంటారు.. జీవిత అనుభవాలు పంచుకున్న సుధా మూర్తి
- Abhijeet Dipke: అభిజీత్ దిప్కే ఇంట్లో విషాదం.. అరెస్టైన కొద్దిసేపటికే ఘటన
- Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతున్న నుస్రత్ జహాన్ దాదాపు రూ.24 కోట్ల మోసాలకు పాల్పడినట్లు తెలుస్తోంది.ఇప్పటికే ఈ వ్యవహారంపై గతంలో కోర్టులో కేసు దాఖలైంది. ఈ కేసులో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ కోర్టుకు హాజరు కాలేదని బాధితులు తెలిపారు. దీంతో చివరికీ ఈడీని ఆశ్రయించామన్నారు. అయితే ఈ విషయంలో నుస్రత్ జహాన్ ఇప్పటివరకు స్పందించలేదు. కాగా.. నుస్రత్ జహాన్ బెంగాలీ సినిమా ఇండస్ట్రీకి చెందిన నటి. ఆమె 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరపున బసిర్‌హాట్ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎంపీగా గెలిచింది. గతంలో ఫిబ్రవరి 2012లో పార్క్ స్ట్రీట్‌లో ఆంగ్లో-ఇండియన్ మహిళపై జరిగిన సామూహిక అత్యాచారం తర్వాత జహాన్ వివాదంలో చిక్కుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఖాదర్ ఖాన్‌కు ఆశ్రయం కల్పించినట్లు జహాన్‌పై ఆరోపణలు ఉన్నాయి. మార్చి 2015లో అత్యాచార బాధితురాలు మరణించింది. నిందితుడు ఖాదర్ ఖాన్ ఇంకా పరారీలో ఉన్నాడు.
తాజావార్తలు
-
Vijay Deverakonda: “బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!”.. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
-
Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
-
CJP Protest: ఆప్‌లో కీలక నేత, ఇప్పుడు కాక్రోచ్లకు పెద్ద దిక్కు.. ఎవరీ అజింక్యా షిండే.?
-
Sudha Murty: చీర కట్టుకుంటే ‘బెహన్జీ’ అంటారు.. జీవిత అనుభవాలు పంచుకున్న సుధా మూర్తి
-
AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!