ED Case: ఈడీ అధికారాలకు పగ్గాలు వేయాల్సిందే.. సుప్రీంకోర్టుకు కీలక విన్నపం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ED Case: భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు కీలక విన్నపం వచ్చింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి ఇచ్చిన అధికారాలకు పగ్గాలు వేయాలని లేకపోతే దేశంలో ఎవరూ ప్రశాంతంగా ఉండలేరని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈడీ పేరుతో దేశంలో బడా వ్యాపార వేత్తలతోపాటు.. ప్రముఖ రాజకీయ పార్టీల నేతలను సైతం విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈడీ అధికారాలకు పగ్గాలు వేయకపోతే ఇబ్బందులు ఎక్కువ అవుతాయని పిటిషనర్ తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కేసు విచారణ సంద్భంగా సుప్రీం ధర్మాసనం కూడా కీలక వ్యాఖ్యలు చేసింది. మనీలాండరింగ్ కేసులను దర్యాప్తు చేయడానికి ఇడికి కఠినమైన అధికారాలు ఇవ్వబడ్డాయని.. ఈ అధికారాలకు పగ్గాలు వేస్తే తప్ప.. భారతదేశంలో ఎవరూ సురక్షితంగా ఉండరని సుప్రీంకోర్టు తెలిపింది.
Read also: Andhra Pradesh: అనకాపల్లిలో విషాదం.. ప్రాణం తీసిన అప్పులు..
Also Read
- Pinarayi Vijayan CMRL Case: మాజీ సీఎం పినరయి విజయన్‌కు హైకోర్టులో షాక్.. CMRL కేసులో FIRకు ఆదేశం!
- Cancer Medicines Price Update: క్యాన్సర్ మందుల ధరలపై కేంద్రం కీలక నిర్ణయం.. 70 శాతం వరకు తగ్గింపు?
- Basit Ali: నానా పటేకర్ ఇచ్చిన ఆ సలహా ఇప్పటికీ మర్చిపోలేను.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ భావోద్వేగం..!
- Sukma Blast: ఛత్తీస్‌గఢ్‌లో పేలుడు.. నలుగురు CRPF జవాన్లకు గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం
ఈడీ అధికారాలపై సర్వోన్నత న్యాయస్థానం ముందుకు మంగళవారం కీలక విన్నపం వచ్చింది. మనీల్యాండరింగ్ కేసుల దర్యాప్తులో ఈడీకి ‘విస్తృతమైన అధికారాలు కల్పించారిని.. ఈ అధికారాలకు పగ్గాలు వేయాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. గురుగ్రామ్‌కు చెందిన రియల్ ఎస్టేట్ గ్రూప్ ఎం3ఎంకి సంబంధించిన పిటిషన్‌లపై విచారణ సందర్భంగా.. జస్టిస్ ఏ ఎస్ బోపన్న, జస్టిస్ ఎంఎం సుందరేష్‌లతో కూడిన ధర్మాసనానికి సీనియర్ న్యాయవాదులు ఈ విన్నపం చేయడం గమనార్హం. ఎం3ఎం తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే.. ఈడీకి విస్తృతమైన అధికారాలు ఇచ్చారని.. కోర్టు గపేర వాటికి అడ్డుకట్టవేయకపోతే దేశంలో ఏ ఒక్కరూ భద్రంగా ఉండరని న్యాయవాదులన్నారు. ఈడీ విచారణకు వారు సహకరిస్తుంటే కూడా వారిని అరెస్ట్ చేశారని.. ఈ అరెస్టు వారి హక్కులను ఉల్లంఘించడమేనని అన్నారు. ఇటువంటి అధికారాలకు పగ్గాలు వేయాల్సిందేనని వివరించారు. ఎం3ఎం డైరెక్టర్లు బసంత్ బన్సాల్, పంకజ్ బన్సాల్‌ను మనీల్యాండరింగ్ కేసులో జూన్ 14న ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వారి తరఫున సీనియర్ లాయర్లు హరీశ్ సాల్వే, ముకుల్ రోహత్గీలు కోర్టుకు హాజరయ్యారు. బన్సల్ సోదరులు ముందస్తు బెయిల్ కోసం పంజాబ్ హర్యానా హైకోర్టును ఆశ్రయిస్తున్నారని, వారి పిటిషన్లను పరిష్కరించాలని ధర్మాసనం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. మనీలాండరింగ్ విచారణలో మాజీ జడ్జిపై లంచం కేసుతో పాటు M3M డైరెక్టర్ల అరెస్ట్‌లో జోక్యం చేసుకోవడానికి నిరాకరించిన ఢిల్లీ హైకోర్టు ఆదేశాలపై సవాళ్లతో సహా ఒక బ్యాచ్ పిటిషన్లను సుప్రీంకోర్టు విచారిస్తోంది.
Read also: BRO : పవన్ రేంజ్ మాములుగా లేదుగా.. భారీ స్థాయిలో జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్..?
మనీల్యాండరింగ్ కేసులో అరెస్టైన బన్సాల్ సోదరులకు పంచకుల పీఎంఎల్ఏ ప్రత్యేక కోర్టు ఐదు రోజుల ఈడీ కస్టడీకి అప్పగించింది. జూన్ 9న ఇదే కేసులో బసంత్,పంకజ్ బన్సల్‌లకు పంజాబ్ హరియాణ హైకోర్టు జూలై 5 వరకు అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు మంజూరు చేసింది. అయినా సరే వారిని అరెస్ట్ చేశారని.. ఇటువంటి కస్టడీ చట్టవిరుద్ధమైన నిర్బంధానికి సమానమని, మనీలాండరింగ్ కేసులో బలవంతపు చర్య నుంచి తమకు రక్షణ కల్పిస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పక్కనబెట్టారని వారి తరఫున లాయర్లు వాదించారు. బన్సల్ సోదరులను అరెస్టైన కేసు.. పంచకులలో డైరెక్టర్‌గా నియమితులైన రూప్ కుమార్ బన్సాల్, మరొక వ్యక్తికి సంబంధించింది. ఈ కేసులో సీబీఐ మాజీ ప్రత్యేక న్యాయమూర్తి సుధీర్ పర్మార్‌పై ఏప్రిల్ 17న హరియాణా పోలీసు అవినీతి నిరోధక విభాగం (ఏసీబీ) ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. నిందితులకు అనుకూలంగా న్యాయమూర్తి పర్మార్ వ్యవహరించారని ఈడీ ఆరోపించింది. ఏసీబీ కేసు నమోదు చేయడంతో పర్మార్‌ను విధుల నుంచి పంజాబ్ హరియాణా హైకోర్టు తప్పించిన విషయం తెలిసిందే.
- Tags
- ED
- Key Plea
- Powers
- Reined
- Supreme Court
తాజావార్తలు
-
Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
AP Local Body Elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. సుప్రీంకోర్టు కీలక సూచనలు
-
Easy Egg Peeling Tips: ఉడికించిన గుడ్లను సులభంగా ఒలిచే సింపుల్ పద్ధతి.. ఈ చిన్న పొరపాట్లు చేయకండి!
-
Pinarayi Vijayan CMRL Case: మాజీ సీఎం పినరయి విజయన్‌కు హైకోర్టులో షాక్.. CMRL కేసులో FIRకు ఆదేశం!
-
Cancer Medicines Price Update: క్యాన్సర్ మందుల ధరలపై కేంద్రం కీలక నిర్ణయం.. 70 శాతం వరకు తగ్గింపు?
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!