Delhi Liquor Policy Case-ED raids: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) శుక్రవారం దేశవ్యాప్తంగా పలు ప్రదేశాల్లో దాడులు నిర్వహిస్తోంది. హైదరాబాద్ కేంద్రంగా ఈ లిక్కర్ స్కామ్ జరిగినట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ తో పాటు ఢిల్లీ, పంజాబ్ లోని 35 ప్రదేశాల్లో దాడులు నిర్వహిస్తోంది ఈడీ. ఈ రాష్ట్రాల్లో మద్యం కంపెనీలు, డిస్ట్రిబ్యూటర్లు, సప్లై చైన్ నెట్వర్క్ కు సంబంధించి పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తోంది.
ఢిల్లీ మద్యం కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో అక్రమాలకు సంబంధించి మనీలాండరింగ్ దర్యాప్తులో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పలు రాష్ట్రాల్లోని 40 ప్రదేశాలలో సోదాలు నిర్వహించింది.
పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఆరుచోట్ల నిర్వహించిన దాడుల్లో సుమారు రూ.7కోట్ల నగదు బయటపడింది. మోసపూరిత మొబైల్ గేమింగ్ యాప్ ద్వారా మోసాలకు పాల్పడుతున్నట్లు నమోదైన మనీలాండరింగ్ కేసులో భాగంగా యాప్ ప్రమోటర్లపై ఈడీ దర్యాప్తు చేపట్టింది.