MLC Kavitha: నాకు నోటీసులు రాలేదు.. అది ఫేక్ న్యూస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLC Kalvakuntla Kavitha Clarity On ED Notice: ఈడీ నుంచి నోటీసులు అందాయన్న వార్తల్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తోసిపుచ్చారు. తనకు ఈడీ నుంచి ఎలాంటి నోటీసులు అందలేదని ఆమె స్పష్టం చేశారు. ఢిల్లీలో కూర్చున్న వ్యక్తులు.. దురుద్దేశంతోనే మీడియాని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఇలాంటి తప్పుడు వార్తలు రాస్తూ సమయాన్ని వృధా చేసుకోకుండా, నిజాల్ని చూపించడానికి సమయాన్ని వినియోగించుకోవాల్సిందిగా మీడియా సంస్థల్ని కోరారు. ‘‘టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకుల సమయాన్ని ఆదా చేసేందుకు, నాకు ఎలాంటి నోటీసులు అందలేదని స్పష్టం చేయాలనుకుంటున్నాను’’ అంటూ కవిత ట్విటర్ మాధ్యమంగా తెలిపారు.
ఇదిలావుండగా.. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత హస్తం కూడా ఉందని బీజేపీ నేతలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే! అప్పుడు తనపై చేసిన ఆ ఆరోపణలపై సీరియస్ అయిన కవిత కోర్టు మెట్లెక్కారు. బీజేపీ నేతలు తనపై నిరాధార ఆరోపణలు చేయకుండా కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. మరోవైపు.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్ 40కి పైగా ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తోంది. ఢిల్లీ, ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో దాడులు చేసింది. ఒక్క హైదరాబాద్‌లోనే 25 బృందాలతో ఈడీ తనిఖీలు చేపట్టింది. అభినవ్‌రెడ్డి, అభిషేక్, ప్రేమ్‌సాగర్‌రావు, అరుణ్ పిళ్ళై ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. ఇందిరాపార్క్ వద్దనున్న శ్రీసాయికృష్ణ రెసిడెన్సీలో సైతం ఈడీ సోదాలు చేపట్టింది.
Also Read
- Medak Ddistrict: తూప్రాలో ఎర్ర లేఖ కలకలం.. ‘పోరాటం మరింత తీవ్రం చేస్తాం’ అంటూ హెచ్చరిక!
- Drugs Seized : ఒడిశా టూ హైదరాబాద్ 'డెడ్ డ్రాప్' డ్రగ్స్ నెట్వర్క్ గుట్టురట్టు
- Water Crisis: హైదరాబాద్ కు తాగునీటి ముప్పు..!
- Komatireddy Venkat Reddy : కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి.. మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్..
చార్టెడ్ అకౌంటెంట్ బుచ్చిబాబు ఇంట్లో పది గంటలకు పైగా ఈడీ బృందం సోదాలు నిర్వహిస్తోంది. అతని దగ్గర పని చేసే శ్రీధర్‌ను అధికారులు అతని ఇంటికి తీసుకెళ్లారు. శ్రీధర్ ఇంట్లో దొరికిన ఆధారాలతో బుచ్చిబాబు నుంచి వివరాల్ని అధికారులు సేకరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అతని ఇంట్లో ఈడీ బృందానికి కీలక ఆధారాలు లభ్యమైనట్టు తెలిసింది. అటు.. నెల్లూరు రాజీవీధిలోని మాగుంట శ్రీనివాసులు రెడ్డి కార్యాలయంలోనూ ఈడీ బృందం తనిఖీ చేస్తోంది. ఒక గదిలో ఎక్కువగా రికార్డులు ఉండటంతో, అదనపు అధికారులు పరిశీలిస్తున్నారు.
తాజావార్తలు
-
Varanasi Update: ఫస్ట్ హాఫ్, ఇంటర్వెల్, క్లైమాక్స్.. ‘వారణాసి’పై క్రేజీ అప్డేట్ వైరల్!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
BRICS Trade Boost: బ్రిక్స్ దేశాల్లో భారతీయ వస్తువులకు భారీ డిమాండ్.. 5 నెలల్లో ఎగుమతులు 34% జంప్
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Medak Ddistrict: తూప్రాలో ఎర్ర లేఖ కలకలం.. ‘పోరాటం మరింత తీవ్రం చేస్తాం’ అంటూ హెచ్చరిక!
ట్రెండింగ్
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?
-
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!