Chikoti Praveen: 15వ తేదీ రావాల్సిందే.. చీకోటికి మరోసారి ఈడీ నోటీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ED notices to Cheekoti Praveen once again: చీకోటి ప్రవీణ్‌కు మరోసారి ఈడీ నోటీసులు జారీ చేసింది. క్యాసినో కేసులో చీకోటి ప్రవీణ్‌ను గతంలో ప్రశ్నించిన ఈడీ.. ఇవాల మరోసారి నోటీసులు జారీ చేసింది. తాజాగా థాయ్‌లాండ్‌లో జరిగిన ఘటన తర్వాత చికోటీకి ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. చీకోటితో పాటు చిట్టి దేవేందర్, సంపత్, మాధవరెడ్డిలకు కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. సంపత్ ఇప్పటికే ఈడీ విచారణకు హాజరయ్యారు. మరో ముగ్గురికి తమ ఎదుట హాజరుకావాలని ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇది ఇలా ఉండగాచికోటి ప్రవీణ్ శుక్రవారం ( మే12న) థాయ్‌లాండ్ నుంచి హైదరాబాద్ రానున్నారు. చికోటి ప్రవీణ్ వచ్చే సోమవారం 15న ఈడీ ముందకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా చీకోటి ప్రవీణ్ కు ఎలాంటి ప్రశ్నలు వేయనున్నారు అనే దానిపై ఆశక్తి నెలకొంది.
Read also: TS Inter results: ntvtelugu.com లో ఇంటర్ ఫలితాలు
Also Read
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
రాజకీయాల్లోకి వస్తున్న అనే వదంతుల వల్లే ఇలా టార్గెట్ చేస్తున్నారని క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. థాయ్‌లాండ్‌లోని ఓ కన్వెన్షన్ సెంటర్‌లో జూదం ఆడుతూ.. చికోటి ప్రవీణ్ అడ్డంగా బుక్కైన తరువాత చికోడి ఈవ్యాఖ్యలు చేశారు. తనని టార్గెట్ చేస్తున్నారని నా తప్పేమీ లేదని చెప్పుకొచ్చాడు. కొన్ని దేశాల్లో పోకర్ టోర్నమెంట్ కి లీగల్ గా పర్మిషన్ ఉన్నాయని మండిపడ్డాడు. అక్కడికి ఒక ప్లేయర్ లాగా ఈవెంట్ కి వెళ్ళానని చికోటి ప్రవీణ్ అన్నాడు. తను రాజకీయాల్లోకి వస్తున్న అనే వదంతులు వల్లే ఇలా టార్గెట్ చేస్తున్నారని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా నాకు లీగల్ గా వందకు పైగా స్థానాల్లో క్యాసినో నడిపే స్థలాలు ఉన్నాయన్నాడు. 100 పోలీసులు పైగా ఈ రైడ్ లో పాల్గొన్నారన్నారని తెలిపారు.
ఈ రైడ్ లో ఓ కమిషనర్ స్థాయి అధికారిపాల్గొన్నారని అన్నాడు. తను తప్పించుకోవడానికి 50 లక్షలు ఇచ్చాను అనేది అవాస్తవమని, ఇదంతా తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. తను ఈవెంట్ ఆర్గనియాజ్ చేయలేదన్నారు. నేను హాల్ లోకి వెళ్లిన 15 నిమిషాలకే రైడ్ జరిగిందని చికోటి ప్రవీణ్ చెప్పుకొచ్చారు. ఈ ఈవెంట్ నాలుగు రోజులు లేదా మూడు రోజులని నాకు తెలియదన్నారు. దేవ్ , సీత నాకు ఆహ్వానం పంపడం వల్లే నేను థాయిలాండ్ కి వెళ్ళానని చికోటి చొప్పుకొచ్చారు. నాలుగు రోజులు ఫోకర్న్ టోర్నమెంట్ అని చెప్పారని, ఆ టోర్నమెంట్ లీగల్ అనే చెప్పారని తెలిపారు. లీగల్ అని నాకు లేఖ పంపారని, అందులో స్టాంప్ లు కూడా పంపారని చికోటి వివరించిన విషయం తెలిసిందే. అయితే ఈనేపథ్యంలో చికోడికి ఈడీ నోటోసులు ఇవ్వడం పై సంచలనంగా మారింది. ఈసారి ఈడీ ఏం ప్రశ్నించనుంది అనే దానిపై సర్వత్రా ఆశక్తి నెలకొంది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!