RTC Chairman Bajireddy: లిక్కర్ స్కామ్ లో లెఫ్టనెంట్ గవర్నర్ బీజేపీ నాయకుడి తో ప్రెస్ మీట్ పెట్టించారని, కేంద్రం తప్పులను కప్పిపుచ్చడానికి ఈ డ్రామాలు ఆడుతున్నారని నిజామాబాద్ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ మండిపడ్డారు. ఎమ్మెల్యే లను కొని ఇక్కడి ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేశారన్నారు. అది బయటపెట్టినప్పటి నుండి కవితను టార్గెట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదానీ కేసు ను కప్పి పుచ్చుకుందుకు ఇదొక డ్రామా ఆడుతున్నారని నిప్పులు చెరిగారు. రాజకీయ కక్షలతో కూడుకున్న ఆరోపణలు చేస్తున్నారని, సీబీఐ , ఈడీ లు కేంద్ర ప్రభుత్వ లాలూచి సంస్థలుగా తయారయ్యాయని ఆరోపించారు. బీఆర్ఎస్ విస్తరించడం వల్లే కేంద్రం ఈ డ్రామాలు ఆడుతుందని మండిపడ్డారు. దేశంలో బిజెపి సోషల్ మీడియా అంత అదానీ నడిపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి ఎన్నికల ఖర్చు అంత అదానీ యే భరిస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, కావాలని కవిత పేరును తీసుకు వచ్చి ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. ఈడీ , సీబీఐ లు చేసే పనులు బిజెపి నేతలు చెప్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
మంత్రి సత్యవతి రాథోడ్ ..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు కానుకలుస్తుంటే కేంద్రంలోని బిజెపి మాత్రం రాష్ట్రంలోని మహిళ నేతలకు నోటీసులు ఇస్తుందని అన్నారు. మహిళా రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో పోరాడుదాం అనుకున్న కవితకు నోటీసులు ఇవ్వడం బిజెపి పతనానికి నాంది అని మండిపడ్డారు. ఈ డి తో100 కోట్ల స్కామ్ జరిగిందని బిజెపి భయపెట్టే ప్రయత్నం చేస్తుంది ఈ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని అన్నారు. కవిత ఎక్కడ తప్పు చేయలేదని, ఎవరికి భయపడకు ఏ విచారణ చేసిన కవిత నిర్దోషిగా బయటకు వస్తుందని అన్నారు. ఈడీ, సిఐడి లలో అక్రమంగా వాడుతూ తెలంగాణ ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారో వీటిని అన్నిటిని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని, తగిన సమయంలో తగిన బుద్ధి చెబుతారని అన్నారు.
Bandi Sanjay: బీజేపీ కి దర్యాప్తు సంస్థలకు సంబంధమే లేదు