Counting Centers: అసెంబ్లీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. డిసెంబర్ 3న నిర్వహించనున్న ఎన్నికల నిర్వహణ, ఓట్ల లెక్కింపు విషయంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు గ్రేటర్‌లో కౌంటింగ్ కేంద్రాలను ఖరారు చేశారు. హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా 14 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు యూసుఫ్‌గూడ కోట్లలోని విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో జరగనుంది. మిగిలిన 13 అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు ఒకే చోట కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మరోవైపు కౌంటింగ్ కేంద్రాల వద్ద మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ ఓట్లు నమోదైన కౌంటింగ్ కేంద్రాలకు ఈవీఎంలను తీసుకెళ్లేందుకు ఇప్పటికే రూట్ మ్యాప్ సిద్ధం చేశారు.
Read also: Hyderabad Rain: హైదరాబాద్ లో వాన జల్లులు.. తడిసి ముద్దయిన నగరం
ఈ దశ తర్వాత, భద్రతా సిబ్బందిని నిరంతరం సిసి కెమెరాల నిఘాలో ఉంచడానికి ప్రణాళిక చేయబడింది. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఆ రోజు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కేంద్రాల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. నియోజకవర్గాల వారీగా ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం బయట, లోపల లైవ్ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ నిఘా కెమెరాల ద్వారా ఓట్ల లెక్కింపునకు అధికారులు కార్యాచరణ రూపొందించారు. నాయకుల సమక్షంలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా కౌంటింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ ఎలాంటి తోపులాటలు, ఘర్షణలకు అవకాశం లేకుండా ఓట్ల లెక్కింపును నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు.
కౌంటింగ్ కేంద్రాలు..
Hyderabad Rain: హైదరాబాద్ లో వాన జల్లులు.. తడిసి ముద్దయిన నగరం