భారత ప్రధాని నరేంద్ర మోడీని కలవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్న బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారు మహ్మద్ యూనస్ కు ఒక లేఖ అందింది. ఈ లేఖను బంగ్లాదేశ్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి మోడీ రాశారు. బంగ్లాదేశ్ మార్చి 26న స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంది. ఈ సందర్భంగా 1971లో భారతదేశం సైనిక సహాయంతో బంగ్లాదేశ్ తూర్పు పాకిస్థాన్ నుంచి విడిపోయి స్వతంత్ర దేశంగా అవతరించిన చారిత్రాత్మక క్షణాన్ని గుర్తు చేశారు. ఈ లేఖలో ప్రధాని మోడీ చరిత్రను ప్రస్తావిస్తూ.. 1971 బంగ్లాదేశ్ విముక్తి యుద్ధ స్ఫూర్తిని బలమైన భారతదేశం-బంగ్లాదేశ్ సంబంధాలకు పునాదిగా అభివర్ణించారు. బంగ్లాదేశ్ స్థాపనలో భారతదేశం పాత్రను గుర్తు చేశారు.
READ MORE: Tollywood : రాబిన్ హుడ్, మ్యాడ్ స్క్వేర్ ప్రీమియర్స్ విషయంలో వెనక్కితగ్గారు..
బంగా బంధు షేక్ ముజిబురాహ్మాన్ వారసత్వాన్ని తుడిచిపెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో మోడీ తన లేఖలో బంగ్లాదేశ్ విముక్తి యుద్ధాన్ని ప్రస్తావించారు. బంగ్లాదేశ్‌లోని భారత హైకమిషన్ పంచుకున్న సందేశంలో ప్రధాని మోడీ బంగ్లాదేశ్ ప్రజలను పలకరిస్తూ.. “ఈ రోజు మన ఉమ్మడి చరిత్ర, త్యాగాలకు నిదర్శనం. ఇవి మన ద్వైపాక్షిక భాగస్వామ్యానికి పునాది వేశాయి” అని రాశారు. మరోవైపు.. యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడంలో ఇబ్బంది పడుతుండగా, మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా రాజకీయ పునరాగమనం గురించి చర్చలు ఊపందుకుంటున్నాయి. షేక్ హసీనా అధికారం నుంచి వైదొలిగిన తర్వాత.. బంగ్లాదేశ్ కొత్త ప్రభుత్వం భారతదేశం పట్ల ఘర్షణాత్మక వైఖరిని అవలంబించడం గమనార్హం. కానీ చాలా విషయాల్లో భారతదేశంపై ఆధారపడిన బంగ్లాదేశ్ ఇప్పుడు మళ్లీ కాళ్ల బేరానికి వస్తోంది.
READ MORE: Plants : వేసవిలో ఇంట్లో మొక్కలు వాడిపోకుండా ఉండాలంటే ఇలా చేయండి..!