విశాఖలో ముగిసిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ పై మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు స్పందించారు. ఎంవోయూలను వాస్తవ రూపంలో తీసుకుని రావడమే ఇప్పుడు ప్రభుత్వం ముందున్న అసలు ఛాలెంజ్ అన్నారు గంటా. నేను 20 ప్రశ్నలతో ప్రభుత్వానికి లేఖ రాస్తే ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోయింది. పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణ ప్రభుత్వం ఎక్కువ చొరవ చూపిస్తోందన్నారు. జగన్ బ్రాండ్ అనుకుంటే ఇంత కాలం పెట్టుబడిదారులు ఎందుకు రాష్ట్రం వైపు చూడలేదో చెప్పగలరా…..? అని గంటా ప్రశ్నించారు.
Read Also: Maheshwar Reddy : మా మధ్య ఏం లేదు.. బాంబు పేల్చిన మహేశ్వరరెడ్డి
టీడీపీ హయాంలో సమ్మిట్ జరిగినప్పుడు డైవర్ట్ చేసేందుకు జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీ ముఖ్య నాయకత్వం చేసిన ప్రయత్నాలు ప్రజలకు గుర్తున్నాయి. నాలుగేళ్లు పారిశ్రామిక అభివృద్ధిని వదిలేసి ఎన్నికల ముందు హడావిడి చెయ్యడం ప్రజల దృష్టిని మళ్లించే ఎత్తుగడలో భాగమే అని దుయ్యబట్టారు గంటా. టీడీపీ హయాంలో ప్రముఖ కంపెనీలు ఒప్పందాలు చేసుకుంటే ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోవడానికి వైసీపీ ప్రభుత్వ విధానాలే కారణం. ఒప్పందాలు చేసుకున్న చొరవ పరిశ్రమలను రాబట్టడంలో ప్రదర్శిస్తే స్వాగతిస్తాం అన్నారు గంటా.
Read Also: Cannabis : అంతర్రాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్.. చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు