An earthquake hits Uttarakhand:ఉత్తరాఖండ్‌లో భూకంపం సంభవించింది. డెహ్రాడూన్ తో పాటు పలు నగరాల్లో భూకంపం వచ్చింది. ఆదివారం ఉదయం 8.33 గంటల ప్రాంతంలో భూకంపం రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. రిక్టర్ స్కేల్ పై 4.5 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది.
Read Also: T20 World Cup: నెదర్లాండ్స్ సంచలనం.. ఇంటిదారి పట్టిన సౌతాఫ్రికా
రాజధాని డెహ్రాడూన్ తో పాటు ఉత్తరకాశీ, బర్కోట్, తెహ్రీ, ముస్సోరీలలో కూడా భూప్రకంపనలు వచ్చాయి. తెహ్రీ కేంద్రంగా భూకంపం వచ్చింది. ఇటీవల కాలంలో హిమాలయ రాష్ట్రాల్లో ఎక్కువగా భూకంపాలు సంభవిస్తున్నాయి. అయితే తీవ్రత తక్కువగా ఉండటంతో పెద్దగా నష్టం జరగడం లేదు. ఇండియన్ టెక్టానిక్ ప్లేట్ నిరంతం ఉత్తరం వైపుగా కదులుతుండటంతో హిమాలయాల్లో తరుచుగా భూకంపాలు వస్తుంటాయి. గతంలో 2015లో దీని కారణంగానే నేపాల్ దేశంలో భారీ భూకంపం సంభవించింది. దీని వల్ల 8 వేలకు పైగా మంది మరణించారు.
ఇండియన్ టెక్టానిక్ ప్లేట్ ప్రతీ ఏడాది 2 సెంటీమీటర్ల చొప్పున ఆసియా టెక్టానిక్ ప్లేట్ ను ఉత్తరం వైపు నెట్టేస్తుంది. అంటే ప్రతీ వంద ఏళ్లకు భారతదేశం 200 సెంటీమీటర్ల ముందుకు కదులుతోంది. ఈ ఢీకొట్టే శక్తి వల్ల నిరంతరం పెరుగుతున్న ఒత్తడి, పీడనం వల్ల ఈ ప్రాంతాల్లో భూకంపాలు సంభవిస్తున్నాయి.